కొనాల్సిన పనే లేదు.. కొత్తిమీరను ఇంట్లో పెంచే చిట్కాలు ఇవే!
Samatha
06 march 2026
కొత్తిమీర లేని ఇల్లు అనేదే ఉండదు. ఎందుకంటే? ఏ వంటకాలకైనా సరే మంచి రుచి వచ్చేది కొత్తిమీర వల్లనే. అందుకే ప్రతి ఒక్కరూ మార్కెట్‌కు వెళ్లినప్పుడు కొత్తిమీర కొనుగోలు చేస్తారు.
కొత్తిమీర
అంతే కాకుండా కొత్తిమీర తినడం వలన అనేక లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో పోషకాలు పుష్కలంగా ఉండటం వలన శరీరానికి చాలా మేలు జరుగుతుంది.
లాభాలు
అయితే కొత్తిమీర ఒకసారి కొంటే దాదాపు 5 రోజులు ఉపయోగించుకోవచ్చు. కానీ అది దాని తాజాదానం కోలప్పోతుంది. అందుకే మనం పెరట్లోనే పెంచుకోవడం వలన, ఎప్పటికప్పుడు, తాజాగా కొత్తిమీర వంటల్లో ఉపయోగించవచ్చును.
కొత్తిమీర ఉపయోగం
మరి కొత్తిమీరను మన ఇంటిలోనే సులభంగా పెంచాలంటే, ముందుగా కొన్ని చిట్కాలు పాటించాలంట. అవి, మంచి ధనియాలను, కొత్తిమీర పండించే వారి దగ్గర కొనుగోలు చేయాలి.
నాణ్యమైన ధనియాలు
ఇక వీటిని నాటడానికి ముందు వాటిని రెండుగా చీల్చి, రాత్రి మొత్తం నీటిలో నానబెట్టి, తర్వాత రోజు, మట్టిలో నాటాలి. మరీ లోతుగా కాకుండా, పైన పైన చల్లుకోవాలి.
నాటడం
గింజలు చల్లిన వెంటనే ఎక్కువ నీరు పోయకూడదు, వారం రోజుల తర్వాత విత్తనాలు మొలుస్తాయి. మొలకగా ఉన్న సమయంలో స్ప్రే ద్వారా నీటిని అందించాలి.
నీటితో స్ప్రే
ఇక అవి పెరుగుతున్నా కొద్ది, కొన్ని కొన్నిగా వాటర్ పోస్తూ రావాలి. మొక్క మంచిగా పెరుగుతుంది. ఆకులు కూడా చాలా పెద్దగా అయ్యి, మనం కూరలో వేసుకునే విధంగా తయారు అవుతుంది.
పెరగడం
దాదాపు కొత్తిమీర 40 రోజుల తర్వాత మనం కూరల్లో ఉపయోగించుకునే విధంగా పెరుగుతుంది. ఇక వీటిని ఆకులను మాత్రమే తుంచాలి, మొక్క పెరుగుతుంటే కట్ చేయాలి. దీని వలన కొమ్మలు ఎక్కువగా వస్తాయి.