AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శనివారం ఈ ఒక్క పనిచేస్తే… ఐశ్వర్యం, అదృష్టం మిమ్మల్ని వదలవు..! ఈ పారపాటు మాత్రం చేయొద్దు

Saturday Rituals for Wealth: శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన పవిత్రమైన రోజు. ఈ రోజున పిండి దీపం వెలిగించడం అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. తద్వారా ధనయోగం సిద్ధిస్తుంది. శనివారం పాటించాల్సిన నియమాలు, తలస్నానం, తులసి దళాలతో పూజ, కాకికి అన్నం పెట్టడం వంటివి ఆర్థిక కష్టాలను తీర్చి, ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని అందిస్తాయి.

శనివారం ఈ ఒక్క పనిచేస్తే... ఐశ్వర్యం, అదృష్టం మిమ్మల్ని వదలవు..! ఈ పారపాటు మాత్రం చేయొద్దు
Sanivaram Puja
Rajashekher G
|

Updated on: Mar 06, 2026 | 9:33 PM

Share

శనివారం అత్యంత పవిత్రమైన రోజు. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన రోజు. ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు, ప్రతి శనివారం ఇంట్లో దీపారాధన చేసుకుంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఇంట్లో కనక వర్షం కురుస్తుందని నమ్మకం. అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి. ఈ దీపం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైనది. ప్రతి శనివారం పిండి దీపం వెలిగించడం ద్వారా త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది.

పిండి దీపం తయారీ, పూజా విధానం

పిండి దీపం తయారు చేయడానికి కొద్దిగా బియ్యపు పిండి తీసుకుని, అందులో బెల్లం తురుము, కొద్దిగా ఆవు నెయ్యి కలిపి నీరు పోసి చపాతీ పిండిలా ముద్దగా తయారు చేసుకోవాలి. ఈ పిండితో ప్రమిదను తయారు చేసి, దానికి కుంకుమ బొట్టు పెట్టి, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి ఏడు వత్తులు వేసి వెంకటేశ్వర స్వామి ముందు దీపం వెలిగించాలి. పిండి దీపం వెలిగించిన వెంటనే ముక్కోటి దేవతలు ప్రత్యక్షమవుతారని, కాబట్టి దీపానికి నమస్కరించి తమ సమస్యలను స్వామికి నివేదించుకోవాలని చెబుతారు. పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించినా వెంకటేశ్వర స్వామి సంతోషిస్తారు.

శనివారం పాటించాల్సిన నియమాలు, అదృష్టం కోసం చేయాల్సిన పూజలు:

  • తలస్నానం:శనివారం ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయడం శుభప్రదం. నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలు తొలగి అదృష్టం కలిసివస్తుంది.
  • పూజ గది శుభ్రత: శనివారం రోజున మాత్రమే పూజ గదిని, దేవుని పటాలను శుభ్రం చేసి, పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇతర రోజుల్లో పూజ గదిని శుభ్రం చేయకూడదు.
  • అలంకరణ: పూజ చేసే ముందు ఇల్లంతా శుభ్రం చేసి, పూజ గదిలో ముగ్గు వేసి, వెంకటేశ్వర స్వామి పటాన్ని పూలతో అలంకరించాలి. తులసి దళాలు స్వామికి అత్యంత ప్రీతికరమైనవి కాబట్టి వాటితో పూజించడం వల్ల కోరికలు నెరవేరి కష్టాలు తీరతాయి.

ధనలాభం కోసం:

  • అప్పుల సమస్యలున్నవారు 21 యాలకులను దారానికి గుచ్చి మాలగా చేసి వెంకటేశ్వర స్వామి పటానికి సమర్పించాలి. ఇది జీవితంలో డబ్బు కొరతను నివారిస్తుంది.
  • ప్రతి శనివారం కాకికి అన్నం పెట్టడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది, ఆర్థికంగా మంచి జరుగుతుంది.
  • సొంతింటి కలలు, ఆస్తిపాస్తులు వృద్ధి చెందాలంటే, రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి 11 ప్రదక్షిణాలు చేయాలి.
  • ఒక రావి ఆకును ఇంటికి తెచ్చి బీరువాలో పెట్టుకోవడం వల్ల ఆకస్మిక ధన లాభం కలుగుతుంది, ఆదాయం రెట్టింపు అవుతుంది.
  • శనివారం కొత్త చీపురు కొనడం ధనలక్ష్మి ఇంటిలోకి రావడానికి సూచిక. పాత చీపురును మాత్రం ఈ రోజున పడేయకూడదు, ఇది ధన నాశనానికి దారితీస్తుంది.
  • ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టడం లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది, సిరిసంపదలు కలుగుతాయి.
  • పూజ గదిలో ఆంజనేయ స్వామికి మల్లెపూలు సమర్పించి కోరికలు కోరుకుంటే అవి వెంటనే నెరవేరుతాయి.
  • ముద్ద కర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇవ్వడం కుటుంబానికి శుభకరం.
  • ఐదు యాలకులను పర్సులో పెట్టుకోవడం ద్వారా డబ్బు పుష్కలంగా ఉంటుంది.
  • ఆరోగ్యం కోసం:అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి శనివారం గోవింద నామాలు చదవాలి లేదా ఓం గోవిందాయ నమః మంత్రాన్ని 21 సార్లు జపించాలి.

శనివారం చేయకూడని పనులు:

  • నూనె కొనడం: అప్పులపాలు, పేదరికం కలుగుతుందని నమ్మకం.
  • ఉప్పు కొనడం: లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది.
  • కొత్త బట్టలు కొనడం.
  • నలుపు రంగు వస్త్రాలు ధరించడం: దరిద్రం వెంటాడుతుంది. దీనికి బదులుగా నీలం రంగు వస్త్రాలు ధరిస్తే అదృష్టం వరిస్తుంది.

ఏలినాటి శని దోష నివారణ: ఏలినాటి శని దోషాలతో బాధపడేవారు ప్రతి శనివారం శివాలయానికి వెళ్లి నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలు తొలగి అదృష్టం పెరుగుతుంది.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు వివిధ వనరుల నుంచి సేకరించి అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)

Follow Us