కామారెడ్డిలో ముసుగు దొంగల ముఠా సంచలనం సృష్టిస్తోంది. మారణాయుధాలతో పలు కాలనీల్లో రెక్కీ నిర్వహిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఓల్డ్ ఎస్పిఆర్, ఆర్కే నగర్లలో ఇనుపరాడ్లతో సంచరించిన దొంగల దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇటీవల జరిగిన దొంగతనాలతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.