AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ గోళ్లలో ఈ మార్పులు కనిపిస్తే.. అస్సల లైట్‌ తీసుకోవద్దు.. డేంజర్ వ్యాధికి సంకేతం కావచ్చు!

ప్రస్తుత కాలంలో చాలా మంది ఎందుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో అధిక కొలెస్ట్రాల్‌ కూడా ఒకటి. దీన్ని గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే ఇది శరీరంలో సైలెంట్‌గా వ్యాపించే సమస్య. ఇది నిశబ్ధంగా రక్తనాల్లోకి ప్రవేశించి కొవ్వుగా పేరుకుపోతుంది. ఈ కారణంగా రక్త ప్రసరణ మందగిస్తుంది. కాబట్టి దీన్ని ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవడం చాలా మంచింది. అయితే ఈ వ్యాధిని సాధారణంగా రక్త పీరక్ష చేయించడం ద్వారా గుర్తించవచ్చు. కానీ మన శరీరంలోని కొన్ని భాగాలు మాత్రం ఈ వ్యాధికి సంకేతాలను మందుగానే ఇస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ గోళ్లలో ఈ మార్పులు కనిపిస్తే.. అస్సల లైట్‌ తీసుకోవద్దు.. డేంజర్ వ్యాధికి సంకేతం కావచ్చు!
High Cholesterol Symptoms
Anand T
|

Updated on: Dec 29, 2025 | 6:30 AM

Share

మీ శరీరంలో అధిక కలెస్ట్రాల్ ఉంటే మీ చేతి వేళ్లలో గోళ్లలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. మీ శరీరంలో రక్త ప్రసరణ మందగించినప్పుడు. రక్తనాళాలు కుంచించుకుపోయి గోళ్ల చివరి భాగాలకు రక్తం వెళ్లదు. దీని కారణంగా గోళ్లు వాటి సహజమైన గులాబీ రంగును కోల్పోయి, తెల్లగా లేదా పాలిపోయినట్లు మారుతాయి. మీలో ఈ లక్షణాలు కనిపిస్తే మీకు అధిక కలెస్ట్రాల్ సమస్య ఉన్నట్టు అర్థం.

అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు

పెళుసైన గోళ్లు: గోళ్లకు సరిపడ రక్త ప్రసరణ, ఆక్సిజన్ , పోషకాలు అందనప్పుడు అవి బలహీనంగా మారుతాయి. దీని కారణంగా చిన్న గాయం తగిలిగా గోళ్లు విరిగిపోవడం, రాలిపోవడం జరుగుతుంది. లేదా అవి పొరలు పొరలుగా రాలిపోవడం జరుగుతుంది. ఈ లక్షణాలు మీలో కనిపిస్తే అది రక్త ప్రసరణ లోపానికి సంకేతం కావచ్చు.

గోళ్లపై నిలువు గీతలు: అయితే చాలా మంది వయస్సు మీద పడుతున్న కొద్ది గోళ్లపై గీతలు రావడం అనేది సహజం. కానీ ఉన్నట్టుండి మీ గోళ్లపై నిలువు గీతలు కనిపిస్తే అది రక్త ప్రసరణ మందగించడమే. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలో మాత్రమే రక్త ప్రసరణ మందగించి గోళ్ల కణజాలం దెబ్బతింటుంది. దీని వల్లే మీ గోళ్లలో నిలువు గీతలు కనిపిస్తాయి.

గోళ్ల పెరుగుదల ఆగిపోవడం: అయితే మీ గోళ్ల పెరుగుదల అనేది సడెన్‌గా ఆగిపోయినా, లేదా గోళ్లు పెరుగుదల నెమ్మదించినా ఇది అధిక కోలెస్ట్రాల్‌కు సంకేతం కావచ్చు. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల పోషకాలు అందక గోళ్ల పెరుగుదల నెమ్మదిస్తుంది.

పసుపు రంగు గోళ్లు: కొన్ని సార్లు చేతి గోళ్లు పసుపు రంగులోకి మారుతాయి. అయితే ఫంగల్ ఇన్ఫెక్షన్ల కారణంగా గోళ్లు ఇలా మారుతాయని చాలా మంది అనుకుంటారు. కానీ కొన్ని సార్లు ఇది అధిక కొలెస్ట్రాల్‌కు కూడా కారణం కావచ్చు. కాబట్టి మీ గోళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి.

గమనిక: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా సేకరించినవి. కాబట్టి వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి. వీటిని టీవీ 9 దృవీకరించట్లేదు

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us