తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత సురేష్ బాబు అధ్యక్షుడిగా విజయం సాధించారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ మద్దతుతో ఆయన గెలుపొందారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మొత్తం 48 మంది కార్యవర్గ సభ్యులలో 31 మందిని గెలిపించుకొని తన బలాన్ని నిరూపించుకుంది. నూతన కార్యవర్గం 2027 వరకు పదవిలో కొనసాగనుంది.