పచ్చ ముత్యాలు వీరికి యమ డేంజర్‌.. ముట్టుకోకపోవడమే బెటర్‌!

28 December 2025

TV9 Telugu

TV9 Telugu

శీతాకాలంలో మార్కెట్‌లో దండిగా ఆకుపచ్చ ముత్యాల్లా. ఎంత అందంగా.. ఆకర్షణీయంగా కనిపించే పచ్చి బఠాణీ దండిగా కనిపిస్తాయి

TV9 Telugu

బఠాణీలను క్యాలీఫ్లవర్‌, క్యాబేజ్‌, బంగాళదుంప, క్యారెట్‌.. ఇలా దేనితో కలిపి వండినా వాటి రుచి రెట్టింపవుతుంది. బిర్యానీ, కిచిడీల్లో ఇవి గనుక లేకపోతే.. పెద్ద లోటుగానే ఉంటుంది

TV9 Telugu

సీజనల్‌ కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల చలికాలంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు

TV9 Telugu

బఠానీలలో మొక్కల ఆధారిత ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, జింక్, విటమిన్లు సి, బి6, ఫోలేట్, విటమిన్లు ఎ, కె అధికంగా ఉంటాయి

TV9 Telugu

పచ్చి బఠాణీలు ఎర్రరక్త కణాలు వృద్ధిచెందడంలో శరీరం అంతటికీ ప్రాణవాయువును అందజేయడంలో తోడ్పడతాయి. రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్ధం చేస్తాయి.

TV9 Telugu

పచ్చి బఠానీల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. 100 గ్రాముల పచ్చి బఠానీలలో 14.2 mg విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది మీ చర్మంలో కొల్లాజెన్‌ను పెంచడంలో కూడా సహాయపడుతుంది

TV9 Telugu

ఇది గాయం మానడానికి, ఆరోగ్యకరమైన చిగుళ్ళకు సహాయపడుతుంది. పచ్చి బఠానీల్లోని పోషకాలు జీర్ణక్రియ, ఎముకలు, కళ్ళు, కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో, శక్తిని పెంచడంలో సహాయపడుతుంది

TV9 Telugu

అయితే యూరిక్ యాసిడ్ సమస్యలు ఉన్నవారు బఠానీ తినకూడదు. ఎందుకంటే వాటిలో ప్యూరిన్లు ఉంటాయి. జీర్ణం చేయడంలో ఇబ్బంది ఉన్నవారు వీటిని తినకుండా ఉండటం మంచిది