బెడ్ రూమ్‌లో మనీ ఫ్లాంట్ పెంచుకోవడం మంచిదే?

Samatha

28 December 2025

ప్రతి ఒక్కరి ఇంటిలో అందమైన మొక్కల్లో మనీ ప్లాంట్ ఒకటి. ఈ మొక్క ఇంటికి అందం తీసుకరావడమే కాకుండా ఆర్థికంగా ప్రయోజనాలను అందిస్తుంది.

ఇంటిలో మనీ ప్లాంట్ పెట్టుకోవడం వలన వాస్తు పరంగా, ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే చాలా మంది దీనిని ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెట్టుకుంటారు.

అయితే కొంత మంది బెడ్ రూమ్‌లో కూడా మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటారు. కాగా, బెడ్ రూమ్‌లో మనీ ప్లాంట్ పెంచుకోవడం మంచిదేనో కాదో ఇప్పుడు చూద్దాం.

మనీ ప్లాంట్ మొక్కను బెడ్ రూమ్‌లో పెంచుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అవి ఏవి అంటే?

మనీ ప్లాంట్ మొక్కలు రాత్రి పూట ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. అందువలన వీటిని బెడ్ రూమ్‌లో పెంచుకోవడం వలన స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుంది.

మనీ ప్లాంట్ ఆకులు ఒత్తిడిని తగ్గించి, ప్రశాంత వాతావరణాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా ఇంటిలో సానుకూలతను ప్రేరేపిస్తాయి.

బెడ్ రూమ్‌లో మనీ ప్లాంట్ ఉండటం వలన ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందంట.

మనీ ప్లాంట్ పడకగదిలో పెంచుకోవడం వలన ఇది గాలిని శుభ్రపరిచి, నిద్ర మెరుగు పడేలా చేస్తుంది. శ్వాస సమస్యలను తగ్గిస్తుంది.