Health Tips: మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు..
పిల్లలు మారం చేస్తున్నారని ఫోన్ ఇస్తున్నారా? ఆహారం తినడానికి, తల్లిదండ్రులు వాళ్లకు ఫోన్ చూపించి అన్నం తినిపిస్తున్నారా? అయితే మీ పిల్లలకు ఈ సమస్యల రావడం పక్కా అని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు తినేటప్పుడు ఫోన్ ఇస్తే వారు ఎంత తింటున్నారో తెలీదు. దీంతో వారు బరువు పెరుగుతారు.
పిల్లలు మారం చేయకుండా ఆహారం తినడానికి, తల్లిదండ్రులు వాళ్లకు ఫోన్ చూపించి అన్నం తినిపిస్తూ ఉంటారు. కానీ క్రమంగా ఇది పిల్లలకు అలవాటుగా మారుతుంది. ఫోన్ చూడకుండా ఆహారం తినడం వారికి కష్టం అవుతుంది. కానీ పిల్లలకు ఈ అలవాటు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. దీని వల్ల పిల్లలకు అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. పిల్లవాడు మొబైల్ చూస్తూ ఆహారం తింటే ఎంత తిన్నది అస్సలు తెలియదు. ఒకరు ఆకలి కంటే తక్కువ తింటారు లేదా ఎక్కువ తింటారు.
అతిగా తింటే ఊబకాయం, తక్కువ తింటే పౌష్టికాహార లోపం రావచ్చు. ఫోన్ చూస్తూనే పిల్లలు ఆహారాన్ని నమలకుండా నోట్లో పెట్టుకుని మింగుతారు. ఇది జీవక్రియను బలహీనపరుస్తుంది. అంతే కాకుండా అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణ సమస్యలు
తినే సమయంలో ఫోన్ చూడటం వల్ల పిల్లల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుందని, దీని వల్ల జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయని ఢిల్లీలోని ఎయిమ్స్‌లోని పీడియాట్రిక్ విభాగంలో డాక్టర్ రాకేష్ కుమార్ తెలిపారు. ఎందుకంటే పిల్లలు ఫోన్‌ని చూస్తూ ఎక్కువ తింటాడు లేదా తక్కువ తింటారని, ఇది అజీర్ణం, గ్యాస్ సమస్యలను కలిగిస్తుందని ఆయన చెప్పారు. ఇది జీర్ణవ్యవస్థను పాడు చేస్తుందని వెల్లడించారు. ఫోన్ చూసి పిల్లల కళ్లు చెడిపోయే ప్రమాదం కూడా ఉందన్నారు. పిల్లల కళ్ళు అలసిపోవచ్చు, ఇది కంటి సమస్యలకు దారితీయవచ్చని తెలిపారు.
ఒత్తిడి & ఆందోళన
భోజనం చేస్తూ ఫోన్ వైపు చూడటం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం పాడు అవుతుంది. ఫోన్ చూస్తూనే పిల్లవాడు సరిగ్గా తినకపోవడమే దీనికి కారణం. దీని కారణంగా శరీరానికి పోషకాహారం అందదు. హార్మోన్ స్థాయిలు క్షీణించవచ్చు. ఇది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.ఫోన్‌లను చూడటం వల్ల పిల్లల సామాజిక నైపుణ్యాలు దెబ్బతింటాయనr డాక్టర్ రాకేష్ వివరించారు. ఫోన్ చూడటం ద్వారా పిల్లలకి తినాలని అనిపించదని, శరీరం పోషకాహార లోపంతో బాధపడవలసి ఉంటుందని చెప్పారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి