AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీరకాయ మీ డైట్‌లో ఉంటే బోలెడన్నీ లాభాలు.. ఇమ్యూనిటీ పెరగడంతో పాటు, గుండెకు మేలు..

భారతదేశంలో చాలా సాధారణంగా తినే కూరగాయ బీరకాయ. ఇది వివిధ రకాల పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. దీనితో తయారు చేసిన వంటకాలు చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఇది మృదువుగా, సులభంగా కరుగుతుంది. కాబటి దీనిని వండటం కష్టం కాదు. అంతేకాదు..క్రమం తప్పకుండా తినడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా..? అవేంటో ఇక్కడ చూద్దాం..

బీరకాయ మీ డైట్‌లో ఉంటే బోలెడన్నీ లాభాలు.. ఇమ్యూనిటీ పెరగడంతో పాటు, గుండెకు మేలు..
Ridge Gourd
Jyothi Gadda
|

Updated on: Dec 28, 2025 | 9:23 PM

Share

బీరకాయలో నీరు పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇది మీ శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. బీరకాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తద్వారా అనేక రకాల ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుకోవచ్చు. బీరకాయలో ఫైబర్ అధికంగా లభిస్తుంది. దీనిని తినడం ద్వారా మలబద్ధకం, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. జీర్ణశక్తి బాగుంటుంది. ఈ కూరగాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా కాపాడుతుంది. తద్వారా డయాబెటిస్ ముప్పు తగ్గించుకోవచ్చు.

బీరకాయ నేచురల్ డీటాక్సిఫయర్ లాగా పనిచేసి కాలేయాన్ని శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. కాలేయం నుంచి విష పదార్థాలను బయటకు పంపిస్తుంది. తద్వారా ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. బీరకాయలో కేలరీలు తక్కువగా, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది తింటే తొందరగా కడుపు నిండి ఆకలి తగ్గుతుంది. తద్వారా ఫ్యాట్ ఏర్పడకుండా ఉంటుంది. బరువు అదుపులో ఉంటుంది. బీరకాయలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు కీళ్ల మంట, వాపు నుంచి కాపాడుతాయి. కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.

బీరకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, వాటర్ కంటెంట్ చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మ కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి. తద్వారా స్కిన్ హెల్తీగా ఉంటుంది. మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు బీరకాయలో ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటు పెరగకుండా కాపాడి గుండెపై ఒత్తిడి నివారిస్తాయి. తద్వారా వయసు పెరిగినా గుండెను బలంగా ఉంచుకోవచ్చు. బీరకాయలో యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు, వాటర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కిడ్నీల వడబోత ప్రక్రియను మెరుగుపరుస్తాయి. తద్వారా కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చడంలో విజయం సాధించాం: సీఎం రేవంత్
ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చడంలో విజయం సాధించాం: సీఎం రేవంత్
60 ఏళ్ల వయసులోనూ పొలాల్లో పని చేసిన తాతల బలం పొలం పాయసమే..
60 ఏళ్ల వయసులోనూ పొలాల్లో పని చేసిన తాతల బలం పొలం పాయసమే..
ఇలా ఉన్నారేంట్రా.. అర్థరాత్రి కాలనీల్లో లవ్ బర్డ్స్ హల్చల్..
ఇలా ఉన్నారేంట్రా.. అర్థరాత్రి కాలనీల్లో లవ్ బర్డ్స్ హల్చల్..
మీరు చేసే ఈ చిన్న పొరపాటుతో మీ ఏసీ పని ఖతం.. కరెంట్ బిల్ డబుల్..
మీరు చేసే ఈ చిన్న పొరపాటుతో మీ ఏసీ పని ఖతం.. కరెంట్ బిల్ డబుల్..
కీలక నిర్ణయం.. ఉద్యోగులకు కనీస వేతనాన్ని సవరించిన తెలంగాణ సర్కార్
కీలక నిర్ణయం.. ఉద్యోగులకు కనీస వేతనాన్ని సవరించిన తెలంగాణ సర్కార్
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీమిండియా షెడ్యూల్ చూశారా..!
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీమిండియా షెడ్యూల్ చూశారా..!
షోలే సినిమా సీన్ రిపీట్.. ప్రేమ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి
షోలే సినిమా సీన్ రిపీట్.. ప్రేమ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి
రిలయన్స్ జియో రూ.189 ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీ..
రిలయన్స్ జియో రూ.189 ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీ..
దీదీ కోటలో మహారాష్ట్ర సీన్.. తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక?
దీదీ కోటలో మహారాష్ట్ర సీన్.. తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక?
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?