30 ఏళ్ల నిశ్శబ్దానికి ముగింపు… ఆ గ్రామంలో పుట్టిన తొలి శిశువు! ఏకంగా కోట్లు ప్రకటించిన ప్రధాని..
ఇటాలియన్ గ్రామంలో ఒక బుల్లి దేవదూత జన్మించింది. ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఆడపిల్ల జననాన్ని గ్రామం మొత్తం పెద్ద పండగలా జరుపుకుంటుంది. ఇది ఆ గ్రామస్తులకు మామూలు వేడుక కాదు. ఒక ఉత్సవం లాంటిది. అంతేకాదు.. ఆ శిశువు ఏడుపు ప్రతిధ్వనికి ఏకంగా దేశ ప్రధాన మంత్రి సైతం స్పందించారు. ఆ గ్రామానికి భారీ బహుమతిని ప్రకటించారు. పాప పుట్టుక ప్రభుత్వానికి ఎలా వేడుక అవుతుంది..? ఆ కథేంటో పూర్తి వివరాల్లోకి వెళితే...

ఇటలీలోని అబ్రుజ్జో పర్వత శ్రేణి ఎత్తులో ఒక చిన్న గ్రామం ఉంటుంది. దాని పేరు పాగ్లియారా డీ మార్సి. ఇక్కడి వాతావరణం చూస్తుంటే.. కాలం ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే.. ఇక్కడ స్కూల్స్ మూతపడ్డాయి. ఇళ్లన్నీ నిర్మానుష్యంగా ఖాళీగా మారాయి. గ్రామమంతా వృద్ధుల శ్వాసల మీద మాత్రమే మనుగడ సాగించింది. ఇలాంటి పరిస్థితుల్లో 2025 మార్చి నెలలో ఈ గ్రామం గుర్తింపునే మార్చేలా ఒక అద్బుతం జరిగింది. 30 సంవత్సరాల తర్వాత గ్రామంలో ఒక ఆడ శిశువు జన్మించింది. ఇది సాధారణ జననం కాదు.. మూడు దశాబ్ధాల తర్వాత జన్మించిన ఆ చిన్నారి గ్రామస్తుల పట్ల దేవదూతగా మారింది. గ్రామం మొత్తం ఆనందంతో నిండిపోయింది.
30 ఏళ్ల తర్వాత జన్మించిన ఆ పాపకు లారా అని పేరు పెట్టారు. ఆమె తల్లి వయసు 42 సంవత్సరాలు, తండ్రి వయసు 56 సంవత్సరాలు. పగ్లియారా డీ మార్సిలో ఆడ శిశువు ఏడుపు శబ్దం ప్రతిధ్వనించడంతో ఆ గ్రామస్తులందరి కళ్లు కన్నీళ్లతో నిండిపోయాయి. తమ గ్రామంలో నవజాత శిశువు ఏడుపు మళ్ళీ వింటారని ఎవరూ ఊహించలేదు. లారా జననంతో గ్రామ జనాభా దాదాపు 20కి పెరిగింది. ఈ సంఖ్య తక్కువగా అనిపించినప్పటికీ అది గ్రామానికి ఒక వరంలాంటిదిగా భావిస్తున్నారు. చిన్నారి లారా జనన వార్త ప్రభుత్వానికి కూడా పండగలా మారింది. ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని లారా పుట్టుకకు లక్షలాది విలువైన బేబీ బోనస్ ప్రకటించారు.
ఇటలీని యూరప్ కు ప్రవేశ ద్వారం అని పిలుస్తారు. అయితే, ఇటలీలో జనన రేటు వేగంగా తగ్గుతోంది. పాగ్లియారా డీ మార్సి గ్రామం దీనికి ప్రధాన ఉదాహరణ. ఇటలీలో యూరప్ లో అత్యల్ప జనన రేటు ఉంది. గత 16 సంవత్సరాలుగా ఇటాలియన్ మహిళలు పిల్లల్ని కనేందుకు దూరంగా ఉంటున్నారు. 2024 లో ఇటలీ జనన రేటు 3,69,944 కు పడిపోయింది. సంతానోత్పత్తి రేటు కూడా 1.18 కి తగ్గింది.
View this post on Instagram
ఇటలీలో పిల్లల జననం తక్కువగా ఉండటానికి అతిపెద్ద కారణం మహిళలు వివిధ పనుల్లో బిజీగా ఉండిపోవటం. పురుషులు, మహిళలు ఇంటిని పంచుకుంటారు. కానీ, మహిళలు గర్భవతి అయితే వారు తమ ఉద్యోగాలను వదిలివేయవలసి వస్తుంది. ఇది కుటుంబ ఆర్థిక పరిస్థితిని కుదేలు చేస్తుంది. అందుకే ఇటాలియన్ మహిళలు పిల్లలను కనడానికి ఇష్టపడరు.
ఇటలీ ప్రధాన మంత్రి గియోర్జియా మెలోని దేశ జనన రేటును పెంచడానికి అనేక చర్యలు తీసుకున్నారు. ఈ విషయంలో మెలోని లారా తల్లిదండ్రులకు 1,000 యూరోల (సుమారు €100,000) (రూ.1,05,79,200.00 Indian Rupee)బేబీ బోనస్‌ను ప్రకటించారు. అదనంగా లారా పెంపకం కోసం మెలోని నెలవారీ €370 (సుమారు €37,000) (భారత కరెన్సీఓ రూ. 39,14,304.00)విరాళాన్ని ప్రకటించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




