ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే.. ఏం జరుగుతుందో తెల్సా?
27 December 2025
TV9 Telugu
TV9 Telugu
కొబ్బరి నీళ్లను చాలా మంది ఇష్టంగా తాగుతారు. కొబ్బరి నీళ్లు రుచిగా ఉంటమే కాకుండా అన్ని వయసుల వారి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపతాయి
TV9 Telugu
కాలంతో సంబంధం లేకుండా అన్ని వేళలా అందుబాటులో ఉండే కొబ్బరి నీళ్లను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు అంటున్నారు
TV9 Telugu
ముఖ్యంగా కొబ్బరి నీళ్లను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల రెట్టింపు లాభాలు పొందొచ్చట. కొబ్బరి నీళ్లల్లో ఎలక్ట్రోలైట్స్ అధికంగా ఉంటాయి. వీటివల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతాయి
TV9 Telugu
ఇది రీఫ్రెష్‌మెంట్ డ్రింక్ లాగా పని చేస్తుంది. నీరసం, అలసట వంటి సమస్యలతో బాధపడే వారికి తక్షణ శక్తిని ఇస్తుంది. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి
TV9 Telugu
కొబ్బరి నీటిని తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ఉబ్బరం, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. అధిక రక్తపోటుతో బాధపడే వారు కొబ్బరి నీళ్లను తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది
TV9 Telugu
కొబ్బరి నీళ్లల్లో ఫైబర్ కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆకలి త్వరగా వేయకుండా నిరోధిస్తుంది. జీవక్రియ వేగం కూడా పెరుగుతుంది. ఫలితంగా బరువు కూడా అదుపులో ఉంటుంది
TV9 Telugu
మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కొబ్బరి నీళ్లు ఉపయోగపడతాయి. మూత్రపిండాల్లో రాళ్లు, మూత్ర నాళాల ఇన్పెక్షన్ లతో బాధపడే వారు కొబ్బరి నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది
TV9 Telugu
కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికి వీటిని ఎల్లప్పుడు తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుందని మర్చిపోకూడదు