Menopause: మెనోపాజ్ దశలో మహిళలకు పొంచిఉన్న గుండెపోటు ముప్పు.. హెచ్చరిస్తున్న వైద్యులు

సాధారణంగా మహిళలకు 50 యేళ్ల తర్వాత పీరియడ్స్ ఆగిపోతాయి. ఈ దశనే మోనోపాజ్ అంటారు. ఈ దశంలో మహిళ మానసిక, శారీరక ఆరోగ్యంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. వీటిల్లో ఒకటి గుండెపోటు. అవును.. ఈ దశంలో మహిళకు గుండె పోటు ప్రమాదం కూడా పొంచి ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు..

Menopause: మెనోపాజ్ దశలో మహిళలకు పొంచిఉన్న గుండెపోటు ముప్పు.. హెచ్చరిస్తున్న వైద్యులు
Menopause In Women
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 24, 2024 | 1:40 PM

మెనోపాజ్ అనేది 51 సంవత్సరాల వయస్సులో ఉన్న మహిళల్లో సంభవించే సహజ ప్రక్రియ. మెనోపాజ్ అంటే ఏడాది పాటు పీరియడ్స్ లేకపోవడం. మహిళలకు ఏడాది పాటు రుతుక్రమం రాకపోతే ఆ దశను మెనోపాజ్ అంటారు. మెనోపాజ్ అనేది శరీరంలో అనేక మార్పులకు కారణమయ్యే సాధారణ ప్రక్రియ. కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత, చాలా మంది వారి రుతుచక్రంలో గణనీయమైన మార్పులను అనుభవిస్తున్నారు. తీవ్రమైన తిమ్మిరి, అధిక రక్తస్రావం, అతితక్కువ రక్తస్రావం వంటి మార్పులు సంభవించాయి. సింగపూర్ హార్ట్ ఫౌండేషన్ ఏడాది చేసిన ఉమెన్స్ హార్ట్ హెల్త్ సర్వేలో గుండె జబ్బులు ఏటా ప్రతి ముగ్గురిలో ఒకరిని మృత్యువుకి అప్పగిస్తున్నట్లు పేర్కొంది. అయినప్పటికీ 80 శాతం కంటే ఎక్కువ మంది మహిళలకు దాని తీవ్రత, లక్షణాల గురించి తెలియదు. ఎందుకంటే ఇది పురుషులతో పోలిస్తే మహిళల్లో భిన్నంగా ఉంటుంది.

మెనోపాజ్ తర్వాత, మహిళల్లో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం ప్రారంభమవుతుంది. మహిళల శరీరంలో మార్పులు ప్రారంభమయ్యేందుకు అసలు కారణం ఇదే. మెనోపాజ్ తర్వాత, మహిళల్లో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.

గుండె జబ్బుల ప్రమాదం ఎందుకు పెరుగుతున్నాయి?

మెనోపాజ్ తర్వాత మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయి తగ్గుతుంది. ఈ హార్మోన్ పునరుత్పత్తికి మాత్రమే కాకుండా అనేక ఇతర ఆరోగ్య సంబంధిత విధులకు కూడా అవసరం. ఎముకల దృఢత్వానికి, చర్మం తేమ, గుండె ఆరోగ్యానికి ఈస్ట్రోజెన్ హార్మోన్ అవసరం. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో ఈస్ట్రోజెన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఇవి కూడా చదవండి

దీని కారణంగా స్త్రీల ధమనులలో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది ఈస్ట్రోజెన్ తక్కువ స్థాయిల వల్ల వస్తుంది. ధమనులలో కొవ్వు పెరుగుదల కారణంగా, అనేక హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అందువల్ల, మెనోపాజ్ తర్వాత మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.

మెనోపాజ్ తర్వాత గుండెను ఎలా కాపాడుకోవాలి?

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యం. కాబట్టి, ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకోవాలి. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.

వ్యాయామం కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి, ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఏరోబిక్ వ్యాయామం గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి వాకింగ్, జాగింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ వంటి కార్యకలాపాలు తప్పనిసరిగా చేయాలి.

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. ఆహారంలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉండేలా చూసుకోవాలి. అందుకు సాల్మన్, ట్యూనా, మాకేరెల్ వంటి కొవ్వు చేపలు, బాదం, వాల్‌నట్ వంటి గింజలను ఆహారంలో తీసుకోవాలి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి, మంటను తగ్గించడంలో సహాయపడతాయి.

అధిక చక్కెర, ఉప్పును నివారించాలి. అధిక ఉప్పు, చక్కెర కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండెకు హానికరం.

ధూమపానం, మద్యం సేవించవద్దు. మద్యం, ధూమపానం కారణంగా, గుండె జబ్బుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ఆల్కహాల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని, ధూమపానం రక్త నాళాలను దెబ్బతీస్తుందని చాలా అధ్యయనాలు వెల్లడించాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. మోనోపాజ్‌ తర్వాత వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించడం ద్వారా హార్మోన్ థెరపీ, మందుల ద్వారా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?