పుష్ప2 చూసేందుకు పోయి.. పోలీసులకు అడ్డంగా దొరికిన స్మగ్లర్

పుష్ప2 చూసేందుకు పోయి.. పోలీసులకు అడ్డంగా దొరికిన స్మగ్లర్

Phani CH

|

Updated on: Dec 24, 2024 | 3:12 PM

రీల్‌ సీన్‌ రియల్‌లోకి వస్తే.. ఎట్టాగుంటుందో ఓ థియేటర్‌లో ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లు చూపించారు పోలీసులు. ఓ మల్టీప్లెక్సు థియేటరులో ‘పుష్ప-2’ సినిమా ప్రదర్శన జరుగుతుంది. ప్రేక్షకులంతా మైమరచిపోయి సినిమాను ఆస్వాధిస్తున్నారు. అయితే ఇంతలో అనుకోని అతిథుల్లా సినిమా హాల్లోకి పోలీసులుఎంట్రీ ఇచ్చారు.

దీంతో అవాక్కైన ప్రేక్షకులు గుడ్లప్పగించి చూస్తుండగా.. ప్రేక్షకుల్లో ఒకడిని పట్టుకుని బయటకు ఈడ్చుకుపోయారు. అయితే అరెస్టైన వ్యక్తి పలు హత్య కేసుల నిందితుడు, డ్రగ్స్‌ స్మగ్లర్‌. దీంతో ప్రేక్షకులు సినిమాలో మరో సినిమాలాంటి ఘటన కళ్లముందు జరగడంతో అవాక్కై చూస్తూ ఉండిపోయారు. ఈ షాకింగ్‌ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని గురువారం అర్ధరాత్రి ఓ మల్టీప్లెక్సు థియేటరులో చోటు చేసుకుంది. ఇక అరెస్టైన ఆ వ్యక్తి పేరు విశాల్‌ మేశ్రామ్‌.. ఓ కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్. ఇతగాడు గురువారం అర్ధరాత్రి సమయంలో నాగ్‌పూర్‌లోని ఓ మల్టీప్లెక్స్‌ థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసిపోయి బ్లాక్‌బాస్టర్‌ మువీ పుష్ప 2 చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నాడు. పలు హత్యా కేసులు, డ్రగ్స్‌ కేసుల్లో నిందితుడిగా ఉన్న విశాల్‌ మేశ్రామ్‌ గత పది నెలలుగా పోలీసులకు దొరక్కుండా ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అయితే ఇతగాడు ఇటీవల విడుదలైన పుష్ప 2 మువీని థియేటర్‌లో చూస్తున్నట్లు సమాచారం అందడంతో అతడిని ట్రాక్‌ చేసిన పోలీసులు నేరుగా థియేటర్‌కు వచ్చి విశాల్‌ను అరెస్ట్ చేశారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లి చేసుకుని ఒక్కటైన.. ఇద్దరు యువ‌తులు !! ఈ జంట లవ్ స్టోరీ తెలుసుకోండి సరదాగా

అయోధ్య బాలరాముడిదే 1st ప్లేస్.. 2వ స్థానంలో తాజ్ మహల్

వార్నీ !! ఒకే ఒక్క కారణంతో.. రూ.కోటి జీతాన్ని వదిలేసుకున్నాడు !!

చిరంజీవితో సినిమా చేయాలని తీవ్రంగా ప్రయత్నించా.. కానీ..

క్లిష్ట పరిస్థితుల్లో తమన్ సాయం చేశాడు.. కానీ నేనే..