Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

kangana Raunaut: ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలు చేసిన కంగనా రనౌత్.. దాని ధర ఎంతంటే..?

బాలీవుడ్ బ్యూటీ, ముక్కుసూటి నటి కంగనా రనౌత్..ఇటీవ‌లి కాలంలో సెన్సేష‌న్స్ క్రియేట్ చేస్తూ హాట్ టాపిక్‌గా మారుతుంది. ఈక్రమంలోనే కంగనా ర‌నౌత్ కొత్త కారుతో వార్త‌ల‌ల్లోకెక్కింది.

kangana Raunaut: ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలు చేసిన కంగనా రనౌత్.. దాని ధర ఎంతంటే..?
Kangana Raunaut
Follow us
Jyothi Gadda

|

Updated on: May 20, 2022 | 8:04 PM

బాలీవుడ్ బ్యూటీ, ముక్కుసూటి నటి కంగనా రనౌత్..(kangana Raunaut)ఇటీవ‌లి కాలంలో సెన్సేష‌న్స్ క్రియేట్ చేస్తూ హాట్ టాపిక్‌గా మారుతుంది. కంగనా తాజా చిత్రం ధాక‌డ్ ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి అభిమానులు క్యూ క‌డుతున్నారు. ఈక్రమంలోనే కంగనా ర‌నౌత్ కొత్త కారుతో వార్త‌ల‌ల్లోకెక్కింది. తను నటించిన ధాకడ్ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా కంగన తన కొత్త కారుతో దర్శనమిచ్చింది. కంపెనీ ప్రతినిధులు ఆమెకు కారు తాళాలను అందజేశారు. కంగన కొనుగోలు చేసిన ఈ కారు ఖరీదు రూ.5 కోట్లు. ఇది మెర్సిడెస్ మేబాక్ ఎస్680 మోడల్ కారు. ధాకడ్ ప్రీమియర్ షోకి కంగన తన కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసింది. కొత్త కారుకు కంగన తల్లి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో కంగనా రనౌత్ కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో, కంగనా తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంది.. బ్లాక్ ప్రింటెడ్ డ్రెస్‌లో మెరుస్తూ కనిపిస్తుంది. పార్క్‌ చేసి ఉంచిన కారు పక్కగానే కంగనా కనిపిస్తుంది. మరో వీడియోలో, కంగనా రనౌత్ తల్లి కొత్త కారుకు పూజ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇకపోతే, కంగనా తన మొదటి కారు BMW 7 సిరీస్‌ని కేవలం 21 సంవత్సరాల వయస్సులోనే కొనుగోలు చేసింది. 2008 సంవత్సరంలో ఈ కారును తీసుకుంది. బాలీవుడ్‌లోని అత్యంత సంపన్న నటీమణుల్లో కంగనా రనౌత్‌ పేరు కూడా ఉంది. కంగనా కఠోర శ్రమతో కోట్లాది రూపాయల ఆస్తిని సంపాదించుకుంది. కంగనా రనౌత్ ఆస్తి వివరాలు పరిశీలించినట్టయితే,.. ఆమెకు మూడు ఇళ్లు ఉన్నాయి. కంగనా రనౌత్ ముంబైలోని ఖార్ వెస్ట్‌లోని ఆర్కిడ్ బ్రీజ్ 16 నంబర్ రోడ్‌లోని ఓ బిల్డింగ్‌ ఐదవ అంతస్తులో నివసిస్తున్నారు. ఈ అంతస్తులో కంగనాకు మొత్తం మూడు ఫ్లాట్లు ఉన్నట్టు తెలిసింది.

ఇవి కూడా చదవండి

కంగనా రనౌత్ యాక్షన్ చిత్రం ధాకడ్ ఈరోజు అంటే మే 20న విడుదలైంది. ఈ చిత్రంలో నటి ఏజెంట్ అగ్ని అనే బోల్డ్ డిటెక్టివ్ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, దివ్యా దత్ మరియు శాశ్వత్ ఛటర్జీ కూడా నటించారు. ఈ చిత్రం గురించి కంగనా రనౌత్ మాట్లాడుతూ, “మన సినిమాల్లో, నిజమైన కోణంలో యాక్షన్ సన్నివేశాలు చేసే హీరోయిన్లు చాలా అరుదుగా కనిపిస్తారు. ఢాఖడ్ నా దగ్గరకు వచ్చినప్పుడు, ఒక హార్డ్‌కోర్ కమర్షియల్ చిత్రంలో ఒక మహిళను యాక్షన్ హీరోయిన్‌గా నటించడానికి ఎవరో ధైర్యం చేయడం చూసి నేను సంతోషించాను. అందుకు నేను పూర్తిగా సిద్ధంగా ఉన్నాను.’

భారీ అగ్ని ప్రమాదం.. 350కి పైగా వాహనాలు దగ్ధం..షాకింగ్‌ వీడియో
భారీ అగ్ని ప్రమాదం.. 350కి పైగా వాహనాలు దగ్ధం..షాకింగ్‌ వీడియో
నా ఫస్ట్ క్రష్ అతడే.. వైష్ణవి చైతన్య
నా ఫస్ట్ క్రష్ అతడే.. వైష్ణవి చైతన్య
రైలులో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చు..ఎక్కువ తీసుకెళ్తే..నిబంధనలు ఏంటి
రైలులో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చు..ఎక్కువ తీసుకెళ్తే..నిబంధనలు ఏంటి
శాలిగౌరారంలో వెలసిన మీసాల రాముడికి కల్యాణం...దేశంలో ఎక్కడలేని
శాలిగౌరారంలో వెలసిన మీసాల రాముడికి కల్యాణం...దేశంలో ఎక్కడలేని
ట్రంప్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలు!
ట్రంప్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలు!
ఆ దర్శకుడికి సెకండ్ ఇచ్చిన డార్లింగ్.. యాక్షన్ జానర్‌లో సినిమా..
ఆ దర్శకుడికి సెకండ్ ఇచ్చిన డార్లింగ్.. యాక్షన్ జానర్‌లో సినిమా..
పీపీఎఫ్‌ వడ్డీ రేట్లపై ప్రభుత్వం నిర్ణయం ఏంటి? వార్షిక వడ్డీ రేటు
పీపీఎఫ్‌ వడ్డీ రేట్లపై ప్రభుత్వం నిర్ణయం ఏంటి? వార్షిక వడ్డీ రేటు
పెద్ది ఫస్ట్ షాట్ వచ్చేసింది..
పెద్ది ఫస్ట్ షాట్ వచ్చేసింది..
ఏపీలో మిస్సైల్‌ టెస్టింగ్‌ సెంటర్‌ ఏర్పాటు..ఎక్కడో తెలుసా?
ఏపీలో మిస్సైల్‌ టెస్టింగ్‌ సెంటర్‌ ఏర్పాటు..ఎక్కడో తెలుసా?
ద్వారకకు అనంత్ అంబానీ పాదయాత్ర.. కొడుకు క్షేమం కోసం భగవంతుడిని..
ద్వారకకు అనంత్ అంబానీ పాదయాత్ర.. కొడుకు క్షేమం కోసం భగవంతుడిని..