JR. NTR Fans Hungama: అర్ధరాత్రి ఎన్టీఆర్‌ ఇంటి వద్ద అసలేం జరిగింది..? పోలీసు లాఠీ ఛార్జ్‌ ముందు పరిస్థితి ఎంటీ..? వీడియోలు వైరల్‌

పోలీసుల రాకకుముందు ఎన్టీఆర్‌ ఇంటి ముందు అసలేం జరిగింది. అభిమానుల సందడి ఎలా ఉంది. తెలియజేసే పలు వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

JR. NTR Fans Hungama: అర్ధరాత్రి ఎన్టీఆర్‌ ఇంటి వద్ద అసలేం జరిగింది..? పోలీసు లాఠీ ఛార్జ్‌ ముందు పరిస్థితి ఎంటీ..? వీడియోలు వైరల్‌
Ntr
Follow us
Jyothi Gadda

|

Updated on: May 20, 2022 | 6:35 PM

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పుట్టిన రోజు కావడంతో అర్ధరాత్రి ఆయన అభిమానులు హల్ చల్ చేశారు. జూనియర్‌ ఎన్టీఆర్‌కు బర్త్‌డే విషేస్‌ చేప్పేందుకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు హైదరాబాద్‌కు తరలివచ్చారు. ఎన్టీఆర్‌ ఇంటి హంగామా సృష్టించారు. అభిమానుల హడావుడి ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ఎన్టీఆర్ ఇంటి ముందే కేక్‌ కట్‌ చేసే సమయంలో అభిమానుల మధ్య చిన్నపాటి గొడవ పెద్ద రచ్చకు దారితీసింది. అయితే, పోలీసుల రాకకుముందు ఎన్టీఆర్‌ ఇంటి ముందు అసలేం జరిగింది. అభిమానుల సందడి ఎలా ఉంది. తెలియజేసే పలు వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ‘జై ఎన్టీఆర్‌.. జై జై ఎన్టీఆర్‌’,అనే నినాదాలు హోరెత్తాయి. ‘హ్యాపీ బర్త్‌డే తారక్‌ అన్నా’ అంటూ ఫ్యాన్స్‌ చేసిన నినాదాలు మారుమోగాయి. రోడ్డుపై టపాసులు కాల్చారు. కేకులు కట్‌ చేసి.. సంబరాలు చేసుకున్నారు.

డ్యాన్సులతో రచ్చ చేశారు. అర్ధరాత్రి కావడంతో ఫ్యాన్స్ హంగామా, అల్లరితో వాహనదారులు, స్థానికులు ఇబ్బంది పడ్డారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. ఎన్టీఆర్‌ అభిమానులను పంపించేందుకు యత్నించారు. అయినా ఫ్యాన్స్ పోలీసుల మాట వినకపోవడంతో లాఠీలను ఝులిపించారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు లాఠీలకు పని చెప్పడంతో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన ఒక్కో వీడియో బయటకు వస్తున్నాయి. నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

పోలీసుల రంగప్రవేశంతో చివరకు ఎన్టీఆర్ అభిమానులు ఎక్కడివారు అక్కడ వెళ్లిపోయారు. ఎన్టీఆర్‌ ఇంటి ముందు రోడ్లపై హడావిడి చేసిన వారిలో కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ తర్వాత విడిచిపెట్టినట్టుగా తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టీవీ9 వైబ్ సైట్ ని ఫాలో అవుతూ ఉండండి..ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీకు అందుబాటులో ఉంటుంది.