Giant Anaconda: రద్దీగా ఉన్న రోడ్డుపై భారీ అనకొండ..ఉలిక్కిపడ్డ వాహనదారులు, ప్రయాణికులు..ఏం చేశారో తెలిస్తే అవాక్కే!

తరచుగా కొన్ని జంతువులు రోడ్ల మీదకు రావటం, ప్రయాణికులు, వాహనదారులు బెంబేలెత్తిపోవటం వంటి వీడియోలు సోషల్‌ మీడియాలో తరచూ చూస్తుంటాం..పలు సందర్భాల్లో కొన్ని జంతువులు రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుండగా,

Giant Anaconda: రద్దీగా ఉన్న రోడ్డుపై భారీ అనకొండ..ఉలిక్కిపడ్డ వాహనదారులు, ప్రయాణికులు..ఏం చేశారో తెలిస్తే అవాక్కే!
Giant Anaconda
Follow us

|

Updated on: May 20, 2022 | 4:41 PM

తరచుగా కొన్ని జంతువులు రోడ్ల మీదకు రావటం, ప్రయాణికులు, వాహనదారులు బెంబేలెత్తిపోవటం వంటి వీడియోలు సోషల్‌ మీడియాలో తరచూ చూస్తుంటాం..పలు సందర్భాల్లో కొన్ని జంతువులు రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుండగా, వాహనదారులు కిలోమీటర్ల మేర నిలిచిపోవటం కూడా చూస్తుంటా.. తాజాగా ఒక భారీ అనకొండ రోడ్డు దాటుతుండగా తీసిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతున్న ఈ వీడియో బ్రెజిల్‌లో జరిగింది. నిజానికి అక్కడి రోడ్డు రద్దీగా ఉంది. చాలా వాహనాలు వేగంగా దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే రోడ్డు దాటుతున్న ఓ పెద్ద అనకొండ కెమెరాకు చిక్కింది.

బ్రెజిల్‌లోని ఇంటర్‌స్టేట్ హైవే BR-364లో ప్రయాణిస్తున్న డ్రైవర్లు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. 9.8 అడుగుల పొడవు అంటే సుమారు మూడు మీటర్లు పొడవైన ఓ పెద్ద పాము – రోడ్డు మధ్యలో ప్రత్యక్షమైంది. ఊహించిన విధంగా ఎదురుపడ్డ భారీ అనకొండని చూసి ప్రయాణీకులు, వాహనదారులు ఒక్కసారిగా అరుపులు కేకలు వేశారు. ఎక్కడి వారు అక్కడే సడెన్‌ బ్రేకులు వేసి వాహనాలను నిలిపివేశారు. ఆ పాము సురక్షితంగా రోడ్డు దాటడానికి అందరూ సహకరించారు. ఇదంతా కొందరు వారి సెల్‌ఫోన్ల సహాయంతో వీడియో తీశారు. ఆ తర్వాత అనకొండ రోడ్డు క్రాస్‌ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయటంతో అది కాస్త వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు రక రకాల కామెంట్లు పెడుతున్నారు. పామును కాపాడేందుకు వాహనదారులు సహకరించిన తీరును నెటిజన్లు ప్రశంసించారు. తమ టైమ్‌ వేస్ట్‌ అనుకోకుండా, భయంకరమైన పామును కొట్టి చంపకుండా కాపాడినందుకు పొగడ్తల కామెంట్లు చేశారు. వీడియో పాతదే అయినప్పటికీ ప్రస్తుతం నెట్టింట్లో మరోమారు ట్రెండ్‌ అవుతోంది.

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ