Canada: కెనడా పార్లమెంట్‌లో ఊహించని సన్నివేశం..ఎంపీ ప్రసంగానికి షాకైన సభ్యులు..ఎందుకో తెలుసా..?

కెనడా ఎంపీ చంద్ర ఆర్యకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కర్నాటకలో జన్మించిన చంద్ర ఆర్య స్వయంగా తన ట్విట్టర్‌ ఖాతాలో పంచుకున్నారు.

Canada: కెనడా పార్లమెంట్‌లో ఊహించని సన్నివేశం..ఎంపీ ప్రసంగానికి షాకైన సభ్యులు..ఎందుకో తెలుసా..?
Chandra Arya
Follow us
Jyothi Gadda

|

Updated on: May 20, 2022 | 2:35 PM

కెనడా ఎంపీ చంద్ర ఆర్యకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కర్నాటకలో జన్మించిన చంద్ర ఆర్య కన్నడలో మాట్లాడుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో కెనడియన్‌ పార్లమెంట్‌ నుండి వచ్చింది. దీనిని ఆర్య స్వయంగా ట్విట్టర్‌లో పంచుకున్నారు. ప్రపంచంలోని ఏ పార్లమెంట్‌లోనూ భారత్‌హ వెలుపల కన్నడ మాట్లాడడం ఇదే తొలిసారి అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కెనడియన్‌ పార్లమెంట్‌లో చంద్ర ఆర్య తన తన ప్రసంగాన్ని కువెంపు కవితతో ముగించారు. దానిని డాక్టర్‌ రాజ్‌కుమార్‌ పాటలో పాడారు.

చంద్ర ఆర్య ట్వీట్‌.. చంద్ర ఆర్య తన ప్రసంగంలో ఇద్దరినీ గుర్తు చేసుకుంటూ..”ఎల్లదరు ఇరువురు అంతారూ ఇరు అందెందీగు నీ కన్నడవాగిరు, అంటే మీరు ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఎప్పుడూ కన్నడిగే.’ అతను ట్విట్టర్‌లో ఇలా వ్రాశాడు, “కెనడా పార్లమెంటులో నేను నా మాతృభాష కన్నడలో మాట్లాడాను. ఈ అందమైన భాషకు సుదీర్ఘ చరిత్ర ఉంది. సుమారు 50 మిలియన్ల మంది ప్రజలు మాట్లాడతారు. ఆర్య ఇంకా మాట్లాడుతూ..”భారతదేశం వెలువల ప్రపంచంలోని ఏ పార్లమెంట్‌లోనైనా కన్నడ మాట్లాడటం ఇదే తొలిసారి’ అని అన్నారు.

చంద్ర ఆర్యకు సుర్జేవాలా కృతజ్ఞతలు తెలిపారు కర్ణాటక ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ సిఎన్‌ అశ్వత్నారాయణ ఈ వీడియోను షేర్‌ చేశారు. కెనడా పార్లమెంట్‌లో కన్నడలో మాట్లాడినందుకు చంద్ర ఆర్యకు ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా, వీడియోను పంచుకుంటూ, భారతదేశం, కర్నాటక రాష్ట్రం గర్వించేలా చేసినందుకు చంద్ర ఆర్యకు ధన్యవాదాలు తెలిపారు. “కర్ణాటకలోని తుమకూరు కుమారుడికి సెల్యూట్‌’ అంటూ సుర్జేవాలా ట్విట్‌ చేశారు.

రణదీప్‌ సూర్జేవాలా ట్విట్‌

ఆర్య 2015లో కెనడా పార్లమెంటుకు ఎన్నికయ్యారు తన కన్నడ ప్రసంగంలో, ఆర్య తాను కర్ణాటకలోని తుమకూరు జిల్లా సిరా తాలూకాకు చెందినవాడినని వివరించాడు. చంద్ర ఆర్య మెదటిసారిగా 2015సంవత్సరంలో కెనాడా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2019లో రెండవసారి నేపియన్‌కు ప్రాతినిధ్యం వహించడం గమనించదగ్గ విషయం. చంద్ర ఆర్య కర్ణాటకలో పుట్టి పెరిగాడు. బెంగళూరు యూనివర్శిటీ నుంచి ఇంజినీరింగ్‌ కోర్సు చేశారు. కర్ణాటక యూనివర్సిటీలో ఎంబీఏ చేస్తున్నప్పుడు, అతను ఖతార్‌కు వెళ్లే ముందు ఢిల్లీలో DRDO, కర్ణాటక స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌లో పనిచేశాడు. చంద్ర ఆర్య ఖతార్‌ నుంచి కెనడా వెళ్లారు. ఎందుకంటే ఆర్య భార్య సంగీత ఒట్టావా కాథలిక్‌ స్కూల్‌ బోర్డ్‌లో పనిచేస్తోంది. దాంతో ఆమెతో కలిసి ఆర్య చంద్ర అక్కడే నివసిస్తున్నారు. ఇక్క ఇక్కడే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. వీరి కుమారుడు సిద్‌, చార్టర్డ్‌ ప్రొషెషనల్‌ అకౌంటెంట్‌, చార్టర్డ్‌ అకౌంటెంట్‌((CPA,CA)