Mercedes-Benz: ఓల్డ్‌ ఇజ్‌ గోల్డ్‌..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారుగా మెర్సిడెస్‌ బెంజ్‌..ధర తెలిస్తే కళ్లు బైర్లే..!

మనం విలాసవంతమైన కార్ల గురించి మాట్లాడినట్లయితే, మెర్సిడెస్-బెంజ్ పేరు మొదటగా వస్తుంది. జర్మన్ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ తన పేరిట సరికొత్త రికార్డు సృష్టించింది. 1955 మోడల్ స్పోర్ట్స్ కారు మెర్సిడెస్ బెంజ్ 300 SLR సిల్వర్ యారో ప్రైవేట్ వేలంలో 14.3 కోట్ల డాల‌ర్ల భారీ ధ‌ర‌కు అమ్ముడుపోయింది.. ఆర్ఎం సూత్బే కంపెనీ ఈ విష‌యాన్ని ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేసింది. గ‌తంలో 1962కు చెందిన ఫెరారీ 250జీటీ కారు 48 మిలియ‌న్ల డాల‌ర్ల‌కు అమ్ముడుపోయింది. […]

Mercedes-Benz: ఓల్డ్‌ ఇజ్‌ గోల్డ్‌..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారుగా మెర్సిడెస్‌ బెంజ్‌..ధర తెలిస్తే కళ్లు బైర్లే..!
Mercedes Benz
Follow us
Jyothi Gadda

|

Updated on: May 20, 2022 | 3:52 PM

మనం విలాసవంతమైన కార్ల గురించి మాట్లాడినట్లయితే, మెర్సిడెస్-బెంజ్ పేరు మొదటగా వస్తుంది. జర్మన్ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ తన పేరిట సరికొత్త రికార్డు సృష్టించింది. 1955 మోడల్ స్పోర్ట్స్ కారు మెర్సిడెస్ బెంజ్ 300 SLR సిల్వర్ యారో ప్రైవేట్ వేలంలో 14.3 కోట్ల డాల‌ర్ల భారీ ధ‌ర‌కు అమ్ముడుపోయింది.. ఆర్ఎం సూత్బే కంపెనీ ఈ విష‌యాన్ని ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేసింది. గ‌తంలో 1962కు చెందిన ఫెరారీ 250జీటీ కారు 48 మిలియ‌న్ల డాల‌ర్ల‌కు అమ్ముడుపోయింది. ఇప్పుడు ఆ రికార్డ్‌ను మెర్సిడెస్‌ బెంజ్‌ బ్రేక్‌ చేసింది. మెర్సిడెస్ బెంజ్ మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డు సృష్టించింది.

వేలంలో కేవలం 10 మంది మాత్రమే..

మే 5వ తేదీన జ‌ర్మ‌నీలోని స్ట‌ట్‌గార్ట్‌లో ఉన్న మెర్సిడెస్‌ బెంజ్ మ్యూజియంలో ఈ కారు వేలం జ‌రిగింది. మెర్సిడెస్‌ కంపెనీలోని రేసింగ్ డిపార్ట్‌మెంట్ ఈ కంపెనీని త‌యారీ చేసింది. చీఫ్ ఇంజినీర్ రుడాల్ఫ్ ఉలెన్‌హ‌ట్ పేరును ఈ కారుకు ఫిక్స్ చేశారు. వేలంలో ఓ ప్రైవేటు వ్య‌క్తి కొనుగోలు చేసినట్టు సమాచారం. 300 ఎస్ఎల్ఆర్ ఉలెన్‌మ‌ట్ కూపే కారును ప్రజల సంద‌ర్శనార్థం పెట్ట‌నున్నారు.. బెంజ్ మ్యూజియంలో మ‌రో 300 ఎస్ఎల్ఆర్ కారు ఉన్న‌ట్లు వెల్లడి.

ఇదిలా ఉంటే, మెర్సిడెస్ కారును కొనుగోలు చేసే సాధనంగా కాకుండా, కొనుగోలుదారుకు కారు పట్ల మంచి అనుబంధం ఉండాలని, దానిని లాభం కోసం విక్రయించకుండా చూసుకుంది మెర్సిడెస్‌ బెంజ్‌. అందుకోసమే వేలం అతి రహస్యంగా జరిగిందని తెలిసింది. వేలంలో కేవలం 10 మంది ఆటోమొబైల్ కంపెనీలను మాత్రమే జాగ్రత్తగా ఎంపిక చేసింది. సిల్వర్ యారో రేసింగ్ కారును ఎవరు దక్కించుకుంటారు వారు మెర్సిడెస్‌కు సంబంధించిన వారిగా తెలిసింది. కారు వేలం ద్వారా వ‌చ్చిన డ‌బ్బును మెర్సిడెస్‌ బెంజ్ ఫండ్‌కు వాడ‌నున్నారు. ఆ డ‌బ్బును ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు సమాచారం.

1950లలో కేవలం రెండు మోడళ్లను మాత్రమే తయారు చేసింది..

మెర్సిడెస్-బెంజ్ 300 SLR ప్రపంచంలోనే వేలం వేయబడిన అత్యంత ఖరీదైన కారుగా నిలిచింది. మెర్సిడెస్ దీనిని 1950లలో తయారు చేసింది. ఈ కారు నమూనాలను మాత్రమే ఉత్పత్తి చేసింది. అప్పటి నుంచి మెర్సిడెస్‌ బెంజ్‌ వీటి తయారీని చూసుకుంటుంది. ఇదిలా ఉంటే, వేలంపాటను కంపెనీ గోప్యంగా ఉంచిందని, ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన 10 మందిని మాత్రమే పిలిచారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఈ కారును ఏ థర్డ్ పార్టీ కొనుగోలు చేయకూడదని కంపెనీ కోరినందున కంపెనీ ఇలా చేసింది. మెర్సిడెస్ బెంచ్‌ను అమెరికాకు చెందిన వ్యాపారవేత్త డేవిడ్ మెక్‌నీల్ కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.

కారు చరిత్ర 1950లో మొట్టమొదటి SLR 300 రేస్ కారును తయారు చేసింది. 1955 నాటికి ఇది రేసింగ్ కార్లపై ఆధిపత్యం చెలాయించింది. 12 రేసుల్లో తొమ్మిదింటిని గెలుచుకుంది. ఈ విజయం వెనుక జువాన్ మాన్యువల్ ఫాంగియో, స్టిర్లింగ్ మోస్ వంటి గుర్తింపు పొందిన డ్రైవర్లు ఉన్నారు. అయితే, 1955 లీ మాన్స్ రేస్ ప్రమాదంలో, కారు డ్రైవర్ పియర్ లెవెగ్, సహా 83 మంది సందర్శకులు చనిపోయారు. దీంతో ఇక అప్పటి నుండి రేసుల నుంచి వైదొలగవలసి వచ్చింది.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే