AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రాత్రైతే చాలు గ్రామంలో వింత ఆకారం.. ఏంటని సీసీ కెమెరాలు చెక్‌ చేయగా..

జనగామ జిల్లాలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. అడవి నుంచి జనావాసాల్లోకి వస్తున్న ఎలుగుబంటి గ్రామస్తులను హడలెత్తిస్తోంది. తాజాగా జఫర్‌గడ్‌ మండలంలోని వేల్పుకొండ గుట్ట దిగువన ఉన్న రామాలయం వద్ద ఎలుగుబంటి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

Viral Video: రాత్రైతే చాలు గ్రామంలో వింత ఆకారం.. ఏంటని సీసీ కెమెరాలు చెక్‌ చేయగా..
Janagama Bear Sighting
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Nov 02, 2026 | 10:46 AM

Share

అడవులు, గుట్టల్లో స్వేచ్ఛగా సంచరించే ఎలుగుబంట్లు దారి తప్పి జనావాసాల్లోకి వస్తున్నాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా జనగామ జిల్లాలోని ఓ గ్రామంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. గుట్టపై నుంచి గ్రామంలోకి వచ్చిన ఎలుగుబంటి రామాలయం పరిసరాల్లో సంచరించడంతో స్థానికులు భయంతో వణికిపోయారు వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా జఫర్‌గడ్‌ మండల కేంద్రంలోని వేల్పుకొండ గుట్టపై సంచరిస్తున్న ఎలుగుబంటి దారి తప్పి తరచూ గ్రామంలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా గుట్ట దిగువన ఉన్న రామాలయం వద్ద ఎలుగుబంటి కనిపించింది. చీకటి పడిన తర్వాత ఆలయ పరిసరాల్లోకి వచ్చిన ఎలుగుబంటి కొంతసేపు అక్కడే సంచరించింది. దీంతో దాన్ని గమనించిన గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ఎలుగుబంటి గ్రామంలోకి వచ్చిన విషయం తెలుసుకున్న స్థానికులు అప్రమత్తమయ్యారు. వెంటనే వాట్సాప్‌ గ్రూపుల ద్వారా ఇతర గ్రామస్తులకు సమాచారం అందించి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎలుగుబంటిని గమనించిన కొందరు గ్రామస్తులు గట్టిగా అరవడంతో అది తిరిగి వేల్పుకొండ గుట్టపైకి వెళ్లిపోయింది.

అయితే, ఎలుగుబంటి మళ్లీ గ్రామంలోకి వస్తుందేమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. వన్యప్రాణులకు ఎలాంటి హాని తలపెట్టవద్దని, వాటిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరిస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రాత్రైతే చాలు గ్రామంలో వింత ఆకారం.. ఏంటని సీసీ కెమెరాలు చూడగా..
రాత్రైతే చాలు గ్రామంలో వింత ఆకారం.. ఏంటని సీసీ కెమెరాలు చూడగా..
కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న ముద్దుగుమ్మ..
కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న ముద్దుగుమ్మ..
మనిషి పేగుల్లోకి పాము లాంటి రోబోట్.. లోపలికి వెళ్లి చేసే పనులు..
మనిషి పేగుల్లోకి పాము లాంటి రోబోట్.. లోపలికి వెళ్లి చేసే పనులు..
పది నిమిషాల్లోనే నోట్లో కరిగిపోయే అటుకుల పాయసం..
పది నిమిషాల్లోనే నోట్లో కరిగిపోయే అటుకుల పాయసం..
నాడు ప్లేయర్‌గా.. 9 ఏళ్ల తర్వాత అదే టీంపై కెప్టెన్‌గా విజయం
నాడు ప్లేయర్‌గా.. 9 ఏళ్ల తర్వాత అదే టీంపై కెప్టెన్‌గా విజయం
దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..
దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..
యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..
యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..
జైల్లోనే స్కెచ్.. SBI బ్యాంకు దోపిడీ వెనుక మాజీ పోలీస్ అధికారి..
జైల్లోనే స్కెచ్.. SBI బ్యాంకు దోపిడీ వెనుక మాజీ పోలీస్ అధికారి..
దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి? 5, 11, 21, 51, 108 వెనుక..
దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి? 5, 11, 21, 51, 108 వెనుక..
ఏపీలో మున్సిపల్ పోరు.. ఈ ప్రాంతాల్లో మళ్లీ జరుగుతున్న పోలింగ్
ఏపీలో మున్సిపల్ పోరు.. ఈ ప్రాంతాల్లో మళ్లీ జరుగుతున్న పోలింగ్