AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ పోరు.. ఈ ప్రాంతాల్లో మళ్లీ జరుగుతున్న పోలింగ్

ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసినా, అవకతవకల కారణంగా కడప, అనంతపురం, తిరుపతి కార్పొరేషన్లతో పాటు నాలుగు మున్సిపాలిటీల్లోని 13 డివిజన్లు/వార్డుల్లో రీపోలింగ్ జరుగుతోంది. ఈ ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. ఇక మంగళవారం కౌటింగ్ జరగనుంది.

AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ పోరు.. ఈ ప్రాంతాల్లో మళ్లీ జరుగుతున్న పోలింగ్
Ap Municipal Re Polling
Anand T
|

Updated on: Nov 02, 2026 | 9:54 AM

Share

ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసినా.. పలు మున్సిపాలిటీల్లో మాత్రం రీపోలింగ్ కొనసాగుతుంది. కడప, అనంతపురం, తిరుపతి కార్పొరేషన్‌లో రీపోలింగ్ నిర్వహించారు ఎన్నికల అధికారులు. అలాగే 4 మున్సిపాలిటీలు- పులివెందుల, జమ్మలమడుగు, మాచర్ల, చీమకుర్తి.. మొత్తం 13 డివిజన్లు, వార్డుల్లో రీపోలింగ్ కొనసాగుతోంది . పోలింగ్‌లో జరిగిన అవకతవకల కారణంగా రీపోలింగ్ నిర్వహిస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటలక వరకు ఈ పోలింగ్ కొనసాగుతోంది.

రీపోలింగ్ జరుగుతున్న ప్రాంతాలు ఇవే

ఇక ఈ రోజు రీపోలింగ్ జరుగుతున్న కార్పొరేషన్‌లు చూసుకుంటే కడప కార్పొరేషన్‌లోని 15వ డివిజన్, తిరుపతి కార్పొరేషన్ -36వ డివిజన్ అనంతపురం కార్పొరేషన్ -30వ డివిజన్, పులివెందుల -1, 3, 7, 8 వార్డులు, జమ్మలమడుగు -3, 17, 29 వార్డులు, మాచర్ల -23వ వార్డు, చీమకుర్తి-14వ వార్డుకు రీపోలింగ్ జరుగుతుంది. ఇక పులివెందులలో 40 వార్డుల్లో ఇప్పటికే 20 వార్డులకు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి

ఇదిలా ఉండగా ఆదివారం కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా మిగతా ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా పూర్తయింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 60.36 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 92 పట్టణ స్థానిక సంస్థల్లోని 3,453 వార్డులకు ఎన్నికల పోలింగ్‌ జరిగింది. 96.89 లక్షల మంది ఓటర్లకు గాను 58.48 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అత్యధికంగా కనిగిరిలో 83.86 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. నెల్లిమర్లలో 80.31 శాతం, నందికొట్కూరులో 80.35 శాతం నమోదైంది. అత్యల్పంగా తిరుపతి కార్పొరేషన్‌లో 46.85 శాతం పోలింగ్‌ నమోదైంది. విశాఖలో 50.02 శాతం, విజయవాడలో 52.10 శాతం పోలింగ్‌ నమోదు అయింది. మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ రేపు జరగనుండటంతో అందరి దృష్టి ఫలితాలపై పడింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏపీలో మున్సిపల్ పోరు.. ఈ ప్రాంతాల్లో మళ్లీ జరుగుతున్న పోలింగ్
ఏపీలో మున్సిపల్ పోరు.. ఈ ప్రాంతాల్లో మళ్లీ జరుగుతున్న పోలింగ్
ఒక్క మ్యాచ్‌లో 19 భారీ రికార్డ్స్.. లిస్ట్ చూస్తే షాకే..!
ఒక్క మ్యాచ్‌లో 19 భారీ రికార్డ్స్.. లిస్ట్ చూస్తే షాకే..!
రాత్రి డబ్బాలో 2పాములను బందించిన స్నేక్ క్యాచర్.. మార్నింగ్ చూడగా
రాత్రి డబ్బాలో 2పాములను బందించిన స్నేక్ క్యాచర్.. మార్నింగ్ చూడగా
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. నేటి నుంచే స్టార్ట్..
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. నేటి నుంచే స్టార్ట్..
కళ్ళు కనపడక కిందపడిపోయే వాళ్ళు ఇవి గుప్పెడు తింటే చాలు
కళ్ళు కనపడక కిందపడిపోయే వాళ్ళు ఇవి గుప్పెడు తింటే చాలు
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్
హైదరాబాద్‏తో షారుఖ్ ఖాన్‌కు ఉన్న అనుబంధం ఏంటో తెలుసా.. ?
హైదరాబాద్‏తో షారుఖ్ ఖాన్‌కు ఉన్న అనుబంధం ఏంటో తెలుసా.. ?
అమావాస్య రోజే దీపావళి ఎందుకు? దీపాలు వెలిగించడం వెనుక అసలు రహస్యం
అమావాస్య రోజే దీపావళి ఎందుకు? దీపాలు వెలిగించడం వెనుక అసలు రహస్యం
రోహ్‌తంగ్ పాస్ లో మ్యాగీ.. ! ఆఫ్ సీజన్‌లోనూ రోజుకి రూ.14 వేలు!
రోహ్‌తంగ్ పాస్ లో మ్యాగీ.. ! ఆఫ్ సీజన్‌లోనూ రోజుకి రూ.14 వేలు!
రామ్ చరణ్ సినిమా కోసం డోరతి హీరో.
రామ్ చరణ్ సినిమా కోసం డోరతి హీరో.