AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దూసుకువస్తున్న తీవ్ర తుఫాన్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

బంగాళాఖాతంలో మురసు తుఫాన్‌ తీవ్ర తుఫాన్‌గా బలపడటంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. తెలంగాణలోనూ పలు జిల్లాలకు ఆరెంజ్‌, రెడ్‌, ఎల్లో అలర్ట్‌లు ప్రకటించారు. తుఫాన్‌ ప్రభావంతో తమిళనాడులోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Shaik Madar Saheb
|

Updated on: Nov 02, 2026 | 9:24 AM

Share
బంగాళాఖాతంలో మురసు తుఫాన్‌ తీవ్ర తుఫాన్‌గా బలపడింది. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో తీర ప్రాంతాల వైపు దూసుకొస్తోంది. చెన్నైకి 260 కిలోమీటర్లు, నెల్లూరుకు 290 కిలోమీటర్లు, ఒంగోలుకు 330 కిలోమీటర్ల దూరంలో తుఫాన్‌ కేంద్రీకృతమైంది. నెల్లూరు – నరసాపురం మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే ప్రమాదం ఉంది. దీంతో ఏపీ, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

1 / 5
మురసు తుఫాన్‌ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాలకు వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. ఏలూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు జిల్లాలపైనా తుఫాన్‌ ప్రభావం ఉండనుంది. అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాలకు కూడా వర్ష హెచ్చరికలు జారీ చేశారు.

2 / 5
తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఆరు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేయగా.. సహాయక చర్యల కోసం మరో ఏడు ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా APCPDCL ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది.

3 / 5
బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుఫాన్‌ ప్రభావం తెలంగాణపైనా పడింది. రాష్ట్రంలో నేటి నుంచి గురువారం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఆరెంజ్, రెడ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేటతో పాటు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

4 / 5
మురసు తుఫాన్‌ ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ముఖ్యంగా రాజధాని చెన్నైలో రాత్రి నుంచే వర్షం దంచికొడుతోంది. తుఫాన్‌ ముప్పు నేపథ్యంలో చెన్నై, తిరువళ్లూరు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. చెన్నైతో పాటు మరో మూడు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

5 / 5
Follow Us
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్

హైదరాబాద్‏తో షారుఖ్ ఖాన్‌కు ఉన్న అనుబంధం ఏంటో తెలుసా.. ?

అమావాస్య రోజే దీపావళి ఎందుకు? దీపాలు వెలిగించడం వెనుక అసలు రహస్యం

రోహ్‌తంగ్ పాస్ లో మ్యాగీ.. ! ఆఫ్ సీజన్‌లోనూ రోజుకి రూ.14 వేలు!

రామ్ చరణ్ సినిమా కోసం డోరతి హీరో.
రామ్ చరణ్ సినిమా కోసం డోరతి హీరో.
రాప్తాడు ఘటన నిందితుడిపై కాల్పులతో ప్రజలు సంబరాలు.. వీడియో

విరిగిన ఎముకలను మళ్ళీ అతికించి.. ఉక్కులా చేసే పొడి ఇదే

18 ఏళ్లు నిండాక సుకన్య సమృద్ది యోజన డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చా

సోమవారం శివుడికే ఎందుకు అంకితం? ఈ రోజు శివారాధన చేస్తే..

Video: 'మేం కూలిపోతున్నాం' పైలట్ చివరి మాటలు! 9 మంది మృతి