AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మారథాన్ పూర్తి చేసి మెడల్ అందుకున్నాడు.. నిమిషాల్లోనే గుండెపోటుతో మృతి!

ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో మారథాన్‌లో పాల్గొన్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు అనూహ్య విషాదం ఎదురైంది. ఎంతో ఉత్సాహంగా పరుగును పూర్తి చేసి మెడల్ అందుకున్న కొద్దిసేపటికే గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. మారథాన్ ముగిసిన తర్వాత అల్పాహారం కోసం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం (నవంబర్ 01) ఉదయం జరిగిన ఈ విషాద ఘటన తోటి రన్నర్లను, నిర్వాహకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Hyderabad: మారథాన్ పూర్తి చేసి మెడల్ అందుకున్నాడు.. నిమిషాల్లోనే గుండెపోటుతో మృతి!
Tragedy At Gachibowli Marathon
Balaraju Goud
|

Updated on: Nov 01, 2026 | 8:36 PM

Share

హైదరాబాద్: ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో మారథాన్‌లో పాల్గొన్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు అనూహ్య విషాదం ఎదురైంది. ఎంతో ఉత్సాహంగా పరుగును పూర్తి చేసి మెడల్ అందుకున్న కొద్దిసేపటికే గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. మారథాన్ ముగిసిన తర్వాత అల్పాహారం కోసం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం (నవంబర్ 01) ఉదయం జరిగిన ఈ విషాద ఘటన తోటి రన్నర్లను, నిర్వాహకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం ఉదయం NEB సంస్థ ఆధ్వర్యంలో మారథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మణికొండలోని అల్కాపూర్ కాలనీకి చెందిన కొమ్మినేని గోపి (36) పాల్గొన్నారు. మారథాన్‌లో ఉత్సాహంగా పరుగెత్తిన ఆయన.. నిర్దేశిత రన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. అనంతరం మెడల్ కూడా అందుకున్నారు. రన్ పూర్తి చేసిన ఆనందంలో ఉన్న గోపి.. కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

మారథాన్ ముగిసిన తర్వాత అల్పాహారం కోసం వెళ్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఈ పరిణామంతో అక్కడున్నవారు ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన మారథాన్ నిర్వాహకులు గోపిని చికిత్స నిమిత్తం సమీపంలోని కేర్ (CARE) ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

మృతుడు కొమ్మినేని గోపి ప్రముఖ ఐటీ సంస్థ IBMలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధతో మారథాన్‌లో పాల్గొన్న ఆయన.. పరుగును పూర్తి చేసి పతకం అందుకున్న కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. ఈ ఘటనతో మారథాన్ ప్రాంగణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మారథాన్‌లో పాల్గొని విజయవంతంగా పరుగును పూర్తి చేసిన వ్యక్తి ఇలా అకస్మాత్తుగా మృతి చెందడంతో తోటి రన్నర్లు షాక్‌కు గురయ్యారు. గోపి మరణవార్త తెలిసి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఉత్సాహంగా ప్రారంభమైన మారథాన్ కార్యక్రమంలో చోటుచేసుకున్న ఈ ఘటన అందరినీ కలచివేసింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us