AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices Today: బంగారం కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్.. దీపావళికి ముందే పెరిగిన ధరలు.. నవంబర్ 2న ధరలివే..

దీపావళికి ముందు నవంబర్ 2న బంగారం ధరలు పెరిగాయి. ఈ వారం ప్రారంభంలోనే ధరలు ఎగబాాకాయి. ధంతేరాస్ పర్వదినాన బంగారం కొనుగోళ్లకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ధరలు పెరగడం చేదువార్తగా చెప్పవచ్చు. అయితే గరిష్ట స్థాయిలో పోలిస్తే బంగారం ధరలు రోజురోజుకు పడిపోతున్నాయి.

Venkatrao Lella
|

Updated on: Nov 02, 2026 | 10:09 AM

Share
రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు క్రమక్రమంగా పడిపోతున్నాయి. దీపావళి పండుగ దగ్గర పడుతుండటంతో బంగారు ఆభరణాలు కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. పండుగ వేళ తమ సేల్స్ పెంచుకునేందుకు గోల్డ్ షాపుల యజమానులు జీరో మేకింగ్ ఛార్జీలు, లక్కీ డ్రాల వంటి ఆకర్షణీయమైన ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నారు. బంగారం అనేది భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు.. ఒక సెంటిమెంట్ కూడా కొనసాగుతోంది. శుభకార్యమైనా, పండుగైనా, పెళ్లిళ్లైనా పసిడి కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. నవంబర్ 2న సోమవారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

1 / 5
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,370 వద్ద ప్రస్తుతం కొనసాగుతూండగా.. నేడు ఒక్కరోజులోనే రూ.490 పెరుగుదల నమోదైంది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,27,750గా పలుకుతుండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.450 మేర పుంజుకుంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

2 / 5
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,520 వద్ద ఇవాళ కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,27,900గా పలుకుతోంది.  చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,39,370 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,27,750 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

3 / 5
వెండి ధరలు కూడా కాస్త పెరిగాయి. చెన్నైలో కిలో వెండి ధర రూ.2 లక్షలుగా ఉంది. ఢిల్లీలో కూడా కిలో సిల్వర్ రూ.2 లక్షల వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో కూడా రూ.2 లక్షలుగా ఉంది.

4 / 5
బంగారం ధరలు రోజు తగ్గుతుండగా.. ఇవాళ స్వల్పంగా పెరిగాయి. ధరల తగ్గుదలకు అమెరికా డాలర్ బలోపేతం కావడం, బాండ్ వాల్యూ పెరగడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నెలకొన్న అంచనాలు ప్రధాన కారణాలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో భారీగా పెరిగిన ధరల క్రమంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడం కూడా ధరల తగ్గుదలకు మరో కారణంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులను బట్టి ధరలు మళ్ళీ పెరుగుతాయా, ఇంకా తగ్గుతాయా అన్నది చెప్పలేమంటున్నారు నిపుణులు. దీంతో పెట్టుబడులు పెట్టేవారు జాగ్రత్తగా వ్యవహరించాలి.

5 / 5
Follow Us
దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..

యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..

జైల్లోనే స్కెచ్.. SBI బ్యాంకు దోపిడీ వెనుక మాజీ పోలీస్ అధికారి..

దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి? 5, 11, 21, 51, 108 వెనుక..

ఏపీలో మున్సిపల్ పోరు.. ఈ ప్రాంతాల్లో మళ్లీ జరుగుతున్న పోలింగ్

ఒక్క మ్యాచ్‌లో 19 భారీ రికార్డ్స్.. లిస్ట్ చూస్తే షాకే..!

రాత్రి డబ్బాలో 2పాములను బందించిన స్నేక్ క్యాచర్.. మార్నింగ్ చూడగా

ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. నేటి నుంచే స్టార్ట్..

కళ్ళు కనపడక కిందపడిపోయే వాళ్ళు ఇవి గుప్పెడు తింటే చాలు

తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్