AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కట్టుకున్న భర్తనే కడతేర్చింది.. చిన్న గొడవకే ఈ మహిళ ఏం చేసిందంటే..?

క్షణికావేశం కాపురంలో నిప్పులు పోసింది.. చిన్నపాటి కుటుంబ కలహాలు చివరకు నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. హైదరాబాద్‌లోని కొత్తపేటలో భార్య విచక్షణ కోల్పోయి కూరగాయలు కోసే కత్తితో భర్త ఛాతీలో పొడిచి దారుణంగా హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కళ్లముందే తండ్రి రక్తపు మడుగులో కుప్పకూలడంతో కూతుళ్లు కన్నీరుమున్నీరయ్యారు.

Hyderabad: కట్టుకున్న భర్తనే కడతేర్చింది.. చిన్న గొడవకే ఈ మహిళ ఏం చేసిందంటే..?
Woman Stabs Husband To Death
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Nov 01, 2026 | 7:09 PM

Share

క్షణికావేశం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. చిన్నపాటి కుటుంబ కలహాలు చివరకు దారుణ హత్యకు దారితీసిన ఘటన హైదరాబాద్‌లోని కొత్తపేట పరిధిలో తీవ్ర కలకలం రేపింది. భార్య కూరగాయలు కోసే కత్తితో ఛాతీపై బలంగా పొడవడంతో భర్త ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన చైతన్యపురి పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లాకు చెందిన కొటెం ప్రభాకర్ తన భార్య రజిత, ఇద్దరు కుమార్తెలతో కలిసి కొంతకాలం క్రితం ఉపాధి నిమిత్తం నగరానికి వలస వచ్చాడు. కొత్తపేట సత్యనగర్ కాలనీలోని గాయత్రి ప్రణవం ఎలైట్ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ నంబర్ 501లో అద్దెకు ఉంటున్నాడు. ప్రభాకర్ అదే అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో అక్టోబర్ 31వ తేదీ ఉదయం సుమారు 9:20 గంటల సమయంలో కుటుంబ విషయాలపై భార్యాభర్తల మధ్య మాటామాటా పెరిగింది. వాగ్వాదం ముదరడంతో విచక్షణ కోల్పోయిన రజిత.. ఇంట్లోని కూరగాయలు కోసే కత్తితో భర్త ప్రభాకర్ ఛాతీపై బలంగా పొడిచింది. తీవ్ర రక్తస్రావంతో ప్రభాకర్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

ఆసుపత్రికి తరలించినా దక్కని ప్రాణం

తండ్రి రక్తపు మడుగులో పడిపోవడాన్ని చూసి భయాందోళనకు గురైన కుమార్తెలు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. తీవ్ర గాయాలపాలైన ప్రభాకర్‌ను సమీపంలోని కొత్తపేట ఓమ్ని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్లు పరీక్షించిన వైద్యులు నిర్ధారించారు.

భార్య అరెస్ట్.. దర్యాప్తు ముమ్మరం

సమాచారం అందుకున్న చైతన్యపురి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి తమ్ముడు కొటెం విజయభాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేశారు. నిందితురాలు రజితను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. చిన్నపాటి మనస్పర్థలు, ఆవేశపూరిత నిర్ణయాల వల్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు తెచ్చుకోవద్దని, సంయమనం పాటించాలని పోలీసులు సూచించారు.

Follow Us
కట్టుకున్న భర్తనే కడతేర్చింది.. చిన్న గొడవకే ఈ మహిళ ఏం చేసిందంటే
కట్టుకున్న భర్తనే కడతేర్చింది.. చిన్న గొడవకే ఈ మహిళ ఏం చేసిందంటే
వెల్లుల్లితో బట్టతల సమస్యకు చెక్.. ఇలా వాడారంటే.. జుట్టు ఒత్తుగా
వెల్లుల్లితో బట్టతల సమస్యకు చెక్.. ఇలా వాడారంటే.. జుట్టు ఒత్తుగా
టీమిండియా @ 400.. టీ20 క్రికెట్‌ హిస్టరీలో సరికొత్త రికార్డ్
టీమిండియా @ 400.. టీ20 క్రికెట్‌ హిస్టరీలో సరికొత్త రికార్డ్
ఆ స్టార్ హీరోకి కూడా నిర్మాతలు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు..
ఆ స్టార్ హీరోకి కూడా నిర్మాతలు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు..
ప్రేమికుల కోసం ఫిన్లాండ్ ఆహ్వానం.. సింగిల్స్‌కు ఫ్రీ జర్నీ!
ప్రేమికుల కోసం ఫిన్లాండ్ ఆహ్వానం.. సింగిల్స్‌కు ఫ్రీ జర్నీ!
ఒక్క మ్యాచ్‌లో హిట్.. 4 మ్యాచ్‌ల్లో ఫట్.. అవసరమంటవా గంభీర్
ఒక్క మ్యాచ్‌లో హిట్.. 4 మ్యాచ్‌ల్లో ఫట్.. అవసరమంటవా గంభీర్
బాలీవుడ్‌లోకి రవిబాబు.. హారర్ సినిమాతో ఎంట్రీ..
బాలీవుడ్‌లోకి రవిబాబు.. హారర్ సినిమాతో ఎంట్రీ..
Video: వాష్‌బేసిన్ ఉన్నా ఇదేం పని?
Video: వాష్‌బేసిన్ ఉన్నా ఇదేం పని?
వాహనదారులకు బిగ్ అలెర్ట్.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు..
వాహనదారులకు బిగ్ అలెర్ట్.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు..
బిగ్‌బాస్ నుంచి రోహిత్ నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా? కౌశల్ వీడియో
బిగ్‌బాస్ నుంచి రోహిత్ నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా? కౌశల్ వీడియో