Shah Rukh Khan : యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్.. కింగ్ సినిమా పై పెరిగిన అంచనాలు..
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ పుట్టినరోజు ఈరోజు (నవంబర్ 1). ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే బాద్షా నటిస్తున్న కొత్త చిత్రం కింగ్. ఈ మూవీపై ఇప్పటికే మంచి హైప్ ఉండగా.. తాజాగా బాద్షా బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి తూ మిల్ జాయే అనే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ పుట్టినరోజు నేడు (నవంబర్ 1). ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బాద్షా 61వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఆయన కథానాయకుడిగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘కింగ్’. అయితే ఈరోజు బాద్షా పుట్టినరోజు కానుకగా ఈ మూవీ నుంచి తొలి పాట ‘తూ మిల్‌జాయే’ (Tu Mil Jaaye) ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. రొమాన్స్, హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల కలయికగా రూపొందిన ఈ పాట విడుదలై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. పాట ప్రారంభంలోనే షారుఖ్ తనదైన శైలిలో పవర్ ఫుల్ డైలాగ్ “నేను కాతిల్‌ని కాను.. ఆషిక్‌ని! నా మహబూబాయే నా లక్ష్యం” అంటూ చెప్పే మాటలు పాటకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆ తర్వాత ప్రకృతి అందాల నడుమ షారుఖ్ ఖాన్, అందాల నటి దీపికా పదుకొణే మధ్య సాగే రొమాంటిక్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఒకవైపు దీపికతో ప్రేమగా కనిపించే షారుఖ్, మరోవైపు విలన్లపై విరుచుకుపడే యాక్షన్ సీక్వెన్స్ కూడా ఈ పాటలో హైలైట్‌గా నిలిచాయి.
ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ షేక్..
ఈ విజువల్ వండర్ పాటను సచిన్-జిగర్ స్వరపరచగా, ప్రముఖ గాయకుడు అరిజిత్ సింగ్, మధుబంతి బాగ్చి ఆలపించారు. ఈ పాటలో అంతర్జాతీయ పాప్ స్టార్ ఎడ్ షీరన్ పాడిన ఇంగ్లీష్ ర్యాప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పీయూష్-షాజియా నేతృత్వంలో వచ్చిన కొరియోగ్రఫీ పాటను ఎంతో కలర్‌ఫుల్‌గా మార్చింది. ‘ఓం శాంతి ఓం’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘పఠాన్’, ‘జవాన్’ చిత్రాల తర్వాత షారుఖ్ , దీపికా కాంబినేషన్‌లో వస్తున్న ఆరో ప్రాజెక్ట్ ఇది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్
ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూ్బ్ , సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఈ పాటకు అరిజిత్ సింగ్ తన మ్యాజికల్ వాయిస్‌తో ప్రాణం పోయగా, అంతర్జాతీయ పాప్ స్టార్ ఎడ్ షీరన్ ఇందులో ఇంగ్లీష్ ర్యాప్‌తో మరింత క్రేజ్ తెచ్చారు. సచిన్-జిగర్ సంగీతం అందించిన ఈ పాట రొమాన్స్ , యాక్షన్ కలయికగా నిలిచింది. పాట మధ్యలో , చివర్లో షారుఖ్ చెప్పే “కాతిల్ నహీ… ఆషిక్ హూన్” అలాగే “ఈసారి గుండెల్లో మంట రగిలింది…” వంటి పవర్‌ఫుల్ డైలాగ్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి.
ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..
షారుఖ్ ఖాన్ పోస్ట్..
Yeh Daur Ishq ka Naseeb Waalon ko milta hai… Jahan Barood ki Khushboo mein Gulab khilta hai…
Of Love and other Battles….
This December, #LoveLikeAKing
#TuMilJaaye song out now! #KING in cinemas 24.12.26
https://t.co/GQfYaDY2Cx
— Shah Rukh Khan (@iamsrk) November 1, 2026
తూ మిల్‌జాయే సాంగ్..
ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..
