AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొలంలో పని చేస్తుండగా ఒక్కసారిగా చిరుత దాడి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చిరుతపులి దాడిలో 65 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందారు. విక్రమ్‌గడ్ తాలూకా సర్షి గ్రామానికి చెందిన తులసి రామా సవార్ మాటేగావ్‌లో పొలం పనులు చేస్తుండగా ఆదివారం సాయంత్రం చిరుత దాడి చేసింది. మెడపై తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వరుస చిరుత దాడులతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పొలంలో పని చేస్తుండగా ఒక్కసారిగా చిరుత దాడి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Palghar Leopard Attack
Shaik Madar Saheb
|

Updated on: Nov 02, 2026 | 10:47 AM

Share

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పొలంలో పని చేసుకుంటున్న ఓ వృద్ధురాలపై చిరుతపులి దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపడంతో పాటు ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించింది. వివరాల ప్రకారం.. పాల్ఘర్ జిల్లాలోని విక్రమ్‌గడ్ తాలూకా సర్షి గ్రామానికి చెందిన తులసి రామా సవార్ (65) అనే వృద్ధురాలు వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. రోజూ మాదిరిగానే.. ఆమె పొలం పనులకు వెళ్లారు.. దహను అటవీ డివిజన్ పరిధిలోని మాటేగావ్ గ్రామంలో పని చేస్తుండగా.. ఆదివారం సాయంత్రం ఆమెపై చిరుత అకస్మాత్తుగా దాడి చేసింది. మెడపై తీవ్రంగా గాయపరచడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.

పెద్దపెద్దగా కేకలు వేయడంతో స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి పరుగులు తీశారు. జనసంచారం పెరగడంతో చిరుత సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. అనంతరం చీకటి పడటంతో ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

సమాచారం అందుకున్న వంగావ్ అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ తుషార్ పచ్‌పుతే సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిత్యం జన సంచారం ఉండే ప్రాంతంలో చిరుత సంచరించి ప్రాణాలు తీయడంపై స్థానిక గ్రామస్థులు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఆ ప్రాంతంలో కెమెరా ట్రాప్‌లను, బోనులను (Cages) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చిరుతను వెంటనే బంధించకపోతే జిల్లా కలెక్టరేట్ ముట్టడిస్తామని గ్రామస్థులు హెచ్చరించారు.

అంతకుముందు, అక్టోబర్ 9న, పాల్ఘర్ మున్సిపల్ కౌన్సిల్ ప్రాంత శివార్లలోని భోగోలే పాడ (నవాలి) వద్ద చిరుత దాడిలో 52 ఏళ్ల మహిళ మృతి చెందింది. ఇది రెండో ఘటన అని స్థానికులు తెలిపారు.

ఆగస్టు 1, 2026 నుండి పాల్ఘర్ అంతటా పలుమార్లు చిరుతపులులు కనిపించాయని.. అటవీ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని పలువురు పేర్కొంటున్నారు.

Follow Us
వామ్మో.. కారుకు పెట్రోల్ బదులు డీజిల్ పోస్తే ఏం జరుగుతుందో తెలుసా
వామ్మో.. కారుకు పెట్రోల్ బదులు డీజిల్ పోస్తే ఏం జరుగుతుందో తెలుసా
 చిరిగిన స్వెటర్‌తో ఇన్ని ప్రయోజనాలా? ఇకపై అస్సలు పడేయకండి!
 చిరిగిన స్వెటర్‌తో ఇన్ని ప్రయోజనాలా? ఇకపై అస్సలు పడేయకండి!
పాకిస్థాన్‌లో బయటపడ్డ జైషే ఉగ్రవాద శిబిరాల గుట్టు..!
పాకిస్థాన్‌లో బయటపడ్డ జైషే ఉగ్రవాద శిబిరాల గుట్టు..!
త్వరలో భాగ్యవంతులు కాబోతున్న రాశులివే..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
త్వరలో భాగ్యవంతులు కాబోతున్న రాశులివే..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
తెలుగులో ఆ హీరో నా ఫెవరేట్ పర్సన్..
తెలుగులో ఆ హీరో నా ఫెవరేట్ పర్సన్..
రోజూ అలసటగా ఉంటున్నారా? శరీరంలో ఈ విటమిన్ తగ్గిందేమో తెలుసుకోండి
రోజూ అలసటగా ఉంటున్నారా? శరీరంలో ఈ విటమిన్ తగ్గిందేమో తెలుసుకోండి
మారుతి కార్ల కొనుగోలుదారులకు బిగ్ షాక్.. పెరిగిన ధరలు..
మారుతి కార్ల కొనుగోలుదారులకు బిగ్ షాక్.. పెరిగిన ధరలు..
గుడ్లు ఉడకబెట్టినప్పుడు నీటిలో ఇదొక్కటి వేస్తే చాలు పెంకు ఈజీగా..
గుడ్లు ఉడకబెట్టినప్పుడు నీటిలో ఇదొక్కటి వేస్తే చాలు పెంకు ఈజీగా..
3 చేపలను కోయకుండా ఐదుగురికి సమానంగా పంచాలి.. ఎలా? చిక్కుప్రశ్న
3 చేపలను కోయకుండా ఐదుగురికి సమానంగా పంచాలి.. ఎలా? చిక్కుప్రశ్న
పబ్‌లు, బార్లు, హోటళ్లలో స్మోకింగ్‌ బ్యాన్!
పబ్‌లు, బార్లు, హోటళ్లలో స్మోకింగ్‌ బ్యాన్!