NTR Movie: 20ఏళ్ల కల నెరవేరిందంటున్న కేజీఎఫ్ డైరెక్టర్..ఎన్టీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు..ట్విట్స్ వైరల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. యంగ్ డైరెక్టర్ టూ పాన్ ఇండియన్ డైరెక్టర్స్ వరకు అందరూ తారక్ తో సినిమా చేయాలనే కోరకుంటారు. అందుకోసం వెయిట్ చేయాల్సి వచ్చినా కూడా ఫరవాలేదనుకుంటారు.. తాజాగా..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. యంగ్ డైరెక్టర్ టూ పాన్ ఇండియన్ డైరెక్టర్స్ వరకు అందరూ తారక్ తో సినిమా చేయాలనే కోరకుంటారు. అందుకోసం వెయిట్ చేయాల్సి వచ్చినా కూడా ఫరవాలేదనుకుంటారు.. తాజాగా అదే చేశానని చెబుతున్నారు పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్. తాను ఎన్టీఆర్ ఫ్యాన్ అని ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పిన ఈ యంగ్ డైరెక్టర్.. తాజాగా ‘ఎన్టీఆర్31’(#NTR31) ప్రాజెక్ట్ తో తన కల నెరవేరబోతోందని అన్నారు. ఈ సినిమా ఐడియా 20 ఏళ్ల క్రితమే వచ్చిందని చెప్పిన ప్రశాంత్ నీల్.. తన ఫేవరెట్ స్టార్ తో, తన డ్రీమ్ ప్రాజెక్ట్ చేయిస్తుండడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు.
ఇక కేజీఎఫ్ 2 భారీ హిట్ తరువాత సలార్ షూటింగ్‌లో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ బర్త్ డే సంర్భంగా.. తాకర్ ఫ్యాన్స్ కు దద్దరిల్లే మ్యాటర్ చెప్పారు. ఓ పక్క‘ఎన్టీఆర్31’ ( #NTR31) ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి షాకిచ్చిన ప్రశాంత్ నీల్.. ఈ సినిమా భారీగా… ఎక్స్‌పెక్టేషన్స్ కు మించి తెరకెక్కనుందనే క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమా స్టోరి కి సంబంధించిన మెయిన్ లైన్‌ను కూడా తారక్ ఫస్ట్ లుక్‌తో పాటు ట్వీట్ చేశారు. పోస్టర్‌తో పాటు ఎన్టీఆర్ పాత్రను వివరించే ప్రయత్నం చేశారు ప్రశాంత్‌నీల్.. ‘రక్తంలో తడిసిన మట్టి మాత్రమే గుర్తుంచుకోవాలి. ఆయన నేల.. ఆయన ప్రస్థానం.. కానీ ఖచ్చితంగా అతని రక్తం కాదు’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్ ను వదిలారు. దీంతో ఈ పోస్టర్ కాస్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఎన్టీఆర్ అభిమానుల్లో మరింత జోష్ నింపుతోంది. ఇకపోతే, ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2023లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.