AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: కుక్కను కాపాడేందుకు పెళ్లిని పక్కకు పెట్టిన పెళ్లికొడుకు..మూగప్రేమకు దాసోహమంటున్న నెటిజన్లు!

సోషల్ మీడియా అంటేనే ఆశ్చర్యం! వివిధ వింత సంఘటనల కలయిక. ఇంతకుముందు, కుక్కల స్వీట్ వీడియోలు సోషల్ మీడియాలో అనేకం వైరల్ అయ్యాయి. కోల్‌కతా ట్రాఫిక్ అధికారి వర్షంలో గొడుగులు పట్టుకుని వీధి కుక్కలకు

Viral video: కుక్కను కాపాడేందుకు పెళ్లిని పక్కకు పెట్టిన పెళ్లికొడుకు..మూగప్రేమకు దాసోహమంటున్న నెటిజన్లు!
Dog Stuck
Jyothi Gadda
| Edited By: Ram Naramaneni|

Updated on: May 20, 2022 | 6:54 PM

Share

సోషల్ మీడియా అంటేనే ఆశ్చర్యం! వివిధ వింత సంఘటనల కలయిక. ఇంతకుముందు, కుక్కల స్వీట్ వీడియోలు సోషల్ మీడియాలో అనేకం వైరల్ అయ్యాయి. కోల్‌కతా ట్రాఫిక్ అధికారి వర్షంలో గొడుగులు పట్టుకుని వీధి కుక్కలకు ఆశ్రయం కల్పించడం కనిపించింది. తాజ్ హోటల్‌లోని ఓ ఉద్యోగి తన గొడుగు కింద పాత్ డాగ్‌కి ఆశ్రయం కల్పించడం.. దాన్ని రతన్ టాటా స్వయంగా గమనించడం ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేసింది. అతను ఆ యువకుడిని ఆశీర్వదించాడు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓ వ్యక్తి పెళ్లికి హాజరయ్యేందుకు స్నేహితులతో కలిసి ఇంటి నుంచి బయలుదేరాడు.

నల్లటి సూట్ వేసుకుని. దారిలో ఖర్స్రోటా నది ఒడ్డున ఇరుక్కుపోయిన ఒక వీధి కుక్కను చూశాడు.. దూరం నుంచే ఆ కుక్క అరుపులు గమనించిన అతడు..దగ్గరకు వెళ్లి ఏం జరిగిందని గమనించాడు..పెళ్లి వేడుకకు వెళ్లే ముందు నేరుగా ఘటనా స్థలానికి వెళ్లాడు. అతను వచ్చినప్పుడు, ఖర్స్రోటా నది వెంబడి కాంక్రీట్ స్థలంలో నిలబడి ప్రాణభయంతో ఆ కుక్క ఆర్తనాదాలు చేస్తుండటం అతడు చూశాడు..దాంతో చలించిపోయాడు..ఇక అతను క్షణం ఆలస్యం చేయకుండా తను వేసుకుని బ్లేజర్‌ విప్పేసి సమీపంలోని ఓ చెట్టు కొమ్మపై వేశాడు… ఆ తర్వాత కాంక్రీట్ కట్ట వెంబడి పడుకుని కుక్కను రక్షించేందుకు ప్రయత్నించాడు.

కాంక్రీట్‌ కట్ట అంచును పట్టుకుని ఉన్న కుక్క భయంతో వణికిపోతూ పైకి చూస్తూ ఉంది. కట్ట అంచున బోర్లా పడుకుని అతడు.. కుక్కను పైకి లాగేందుకు చాలా సేపు ప్రయత్నించాడు. కుక్క కోసం పెళ్లి దుస్తుల్లోనే ప్రాణల మీదకు రిస్క్‌ అని తెలిసినా సాహాసం చేశాడు. ‘ఎప్పుడైనా ప్రమాదంలో పడవచ్చు జాగ్రత్త’ అని అవతలి వ్యక్తి చెప్పడం వీడియోలో వినిపిస్తోంది! ఆ వ్యక్తికి బదులిచ్చాడు, “నా గురించి చింతించకండి, ముందుగా కుక్కను రక్షించాలి.” అప్పుడు అతని స్నేహితుడు కూడా ముందుకు వచ్చాడు. ఇంకొంచెం కిందకు జారితే అతను పడిపోతాడని భయపడ్డాడో ఏమో.. అక్కడి నుంచే ప్రయత్నిస్తూ ఉండగా మరో వ్యక్తి వచ్చి తనకు సపోర్ట్ ఇచ్చాడు. అలా ముందుకు వంగి కుక్క కాలిని అందుకున్నాడు. అటుపై మెల్లిగా దాన్ని పైకి లాగాడు.. తనతో పాటు ఉన్న మరో వ్యక్తి కుక్కను అందుకుని ఒడ్డున పడేశాడు. ఆ తర్వాత కుక్కను కాపాడిన ఆ పెళ్లికొడుకు దాంతో పాటే వెడ్డింగ్ హాల్ కు వెళ్లాడు. ఇదంతా దూరం నుంచి వీడియో తీసిన స్థానికులు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. దాంతో వీడియో కాస్త వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు సదరు పెళ్లి కొడుకు జంతుప్రేమపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కామెంట్ల రూపంలోనే అతనికి పెళ్లి విషేస్‌ కూడా చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇలాంటి మరెన్నో వైరల్ వీడియోలు మీ కోసం టీవీ9 వెబ్ సైట్ లో..