Viral video : తెల్లవారుజాము పెళ్లి మూహూర్తం..వధూవరులకు విచిత్ర టాస్క్‌ ఇచ్చిన పంతులు..దెబ్బకు మత్తు వీడింది!

భారతీయ వివాహాలు అందంగా ఉంటాయి. ఆచారాలు, సంప్రదాయాలతో నిండివున్న పెళ్లి వీడియోలు తరచుగా వైరల్‌ అవుతుంటాయి. పెళ్లికి ముందు పసుపువేసే కార్యక్రమం నుంచి పెళ్లి అనంతరం బరాత్‌, రిసెప్షన్‌ వరకు అంతా సందడే..

Viral video : తెల్లవారుజాము పెళ్లి మూహూర్తం..వధూవరులకు విచిత్ర టాస్క్‌ ఇచ్చిన పంతులు..దెబ్బకు మత్తు వీడింది!
Indian Wedding F
Follow us
Jyothi Gadda

|

Updated on: May 20, 2022 | 9:05 PM

భారతీయ వివాహాలు అందంగా ఉంటాయి. ఆచారాలు, సంప్రదాయాలతో నిండివున్న పెళ్లి వీడియోలు తరచుగా వైరల్‌ అవుతుంటాయి. పెళ్లికి ముందు పసుపువేసే కార్యక్రమం నుంచి పెళ్లి అనంతరం బరాత్‌, రిసెప్షన్‌ వరకు అంతా సందడే..ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. ప్రతి వధూవరులకు పెళ్లి రోజు చాలా ప్రత్యేకమైంది. తమ వివాహ వేడుకను చిరస్మరణీయంగా మార్చుకోవడానికి ఉన్నంతలో ఎంతో ఘనంగా పెళ్లి వేడుకను చేసుకుంటున్నారు. అయితే, పెళ్లికి వచ్చే స్నేహితులు, బంధు మిత్రులు సైతం ఆ వివాహ వేడుక మరింత గుర్తుండిపోయేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లకు సంభందించిన వీడియోలు సోషల్‌ మీడియోలో వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో వివాహానికి సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందటే..పెళ్లి వేదికపై వధూవరులిద్దరికీ ఓ విచిత్ర టాస్క్‌ ఇచ్చాడు పురోహితుడు..అది విన్న వరుడు వధువు, వివాహానికి వచ్చిన బంధువులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.

వీడియో ఆధారంగా ఓ జంట వివాహ సమయం తెల్లవారుజాము 3గంటల ప్రాంతం..అందరూ రాత్రంతా పెళ్లి పనులతో అలసిపోయి ఉన్నారు. దాంతో పెళ్లి సమయానికి వధూవరులు, సహా అందరూ నిద్రమత్తుతో కునికి పాట్లు పడుతున్నారు. దాంతో పెళ్లి చేస్తున్న పంతులు ఓ విచిత్ర పని చేశారు. వధూవరులను మండపపైనే పరిగెత్తమని కోరాడు. అది విన్న కొత్త జంట ఒక్కసారిగా అవాక్కైంది. ఇదేం ట్విస్ట్‌ అనుకుంటూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. పంతులు పెట్టిన పరీక్షకు అంతా తెగ నవ్వుకున్నారు. దాంతో నిద్రమత్తు వీడిపోయి, మండపంలో ఉల్లాసంగా నవ్వులు విరిశాయి. ఈ ఫన్నీ ఇన్సిడెంట్‌ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

వీడియో చూసిన నెటిజన్లు సైతం పగలబడి నవ్వుకుంటున్నారు. ఇదేం టాస్క్ అండి పంతులుగారు అంటూ ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.