AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: న‌డిరోడ్డుపై ఓ అమ్మాయి పోల్‌ డ్యాన్స్‌.. నివ్వెర‌పోయిన జ‌నం, రచ్చ రచ్చ చేశారు..!

సోషల్ మీడియాలో నిత్యం బోలెడు వైరల్ వీడియోలు కనిపిస్తుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పించేవి, కొన్ని ఆలోచింపజేసేవి, మరికొన్ని షాక్‌కి గురిచేసేవి.. ఇలా రకరకాల వీడియోలు దర్శనమిస్తుంటాయి. తాజాగా ఓ అమ్మాయి పోల్‌ డ్యాన్స్‌కు సంబంధించిన ఓ వీడియో

Viral video: న‌డిరోడ్డుపై ఓ అమ్మాయి పోల్‌ డ్యాన్స్‌.. నివ్వెర‌పోయిన జ‌నం, రచ్చ రచ్చ చేశారు..!
Pole Dance
Jyothi Gadda
|

Updated on: May 20, 2022 | 9:29 PM

Share

సోషల్ మీడియాలో నిత్యం బోలెడు వైరల్ వీడియోలు కనిపిస్తుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పించేవి, కొన్ని ఆలోచింపజేసేవి, మరికొన్ని షాక్‌కి గురిచేసేవి.. ఇలా రకరకాల వీడియోలు దర్శనమిస్తుంటాయి. తాజాగా ఓ అమ్మాయి పోల్‌ డ్యాన్స్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటర్‌నెట్‌ వేదికగా ఇది చ‌ర్చ‌నీయాంశ‌ంగా మారింది. లింగ పక్షపాత చర్చకు ఈ వీడియో దారితీసింది. చివ‌రికి, ఇస్లామాబాద్ పోలీసులు ఆ యువ‌తి మ‌తి స్థిమితం లేని వ్య‌క్తి అని, ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నార‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. కానీ, వీడియో తీసే వారు మాట్లాడిన మాట‌లపై కొంద‌రు నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇంకొంద‌రు, ఆమె అలా చేయ‌డం స‌భ్య‌త కాదంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఇంతకు వీడియోలో ఏముంది..? ఓ యువతి చేసిన డ్యాన్స్‌ ఎందుకింత సంచలనంగా మారింది…పూర్తి వివరాలు పరిశీలించగా…

వీడియో ఆధారంగా…పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌కు చెందిన ఓ అమ్మాయి బహిరంగ ప్రదేశంలో రోడ్డు మ‌ధ్య‌లో ఉన్న డివైడ‌ర్‌పై డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది. అక్క‌డున్న సైన్ బోర్డు పోల్‌ను ప‌ట్టుకొని ఆ యువతి ఆదమర్చిపోయి డ్యాన్స్ మూమెంట్స్ చేస్తుంది. ఇది చూస్తున్న దూరంగా ఉన్న ఓ వ్య‌క్తి కెమెరాను జూమ్ చేసి మరీ వీడియో చిత్రీకరించాడు. ఆ త‌ర్వాత ఆమెను నిందిస్తూ, దీన్ని ఇస్లామాబాద్ పోలీసు అధికారి ఖాతాకు ట్యాగ్ చేస్తాడు. అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన ఆ అమ్మాయిపై అవసరమైన చర్య తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోలీసులను డిమాండ్‌ చేశాడు. దాంతో అతడు తీసిన యువతి డ్యాన్స్‌ వీడియోతో పాటు, అతని కంప్లైట్‌ కూడా వైరల్‌గా మారింది. నెటిజన్ల ఆగ్రహానికి గురైంది.

ఇవి కూడా చదవండి

అమ్మాయి డ్యాన్స్‌ని సీక్రెట్‌గా వీడియో తీసిన వ్యక్తి కఠినంగా శిక్షించాలంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ యువతి ఎవరికీ ఎలాంటి హానీ చేయలేదు. అమ్మాయిలు స్వేచ్ఛగా డ్యాన్స్‌ చేసుకునే స్వతంత్రం కూడా లేదా అంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు..

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ