నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ మిస్టిక్ థ్రిల్లర్‌లో మీనాక్షి చౌదరి దక్ష అనే ఆర్కియాలజిస్ట్ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా 2026 డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కూడా ప్రారంభమయ్యాయి.
తమిళ హీరో కార్తీ నటిస్తున్న ఓ తెలుగు సినిమాలో మీనాక్షి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
కార్తీ, మీనాక్షి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్నట్లు సమాచారం.
ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మిస్తున్నారు. గతంలో ఈ నిర్మాణ సంస్థలో మీనాక్షి నటించిన సినిమాలు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి.
నాక్షి చౌదరి ఓ హిందీ ప్రాజెక్టులోనూ నటించనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే సినిమా పూర్తి వివరాలు, అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సి ఉంది.
మీనాక్షి అప్‌కమింగ్ సినిమాల జాబితాలో హిందీ చిత్రం ఫోర్స్ 3 పేరు కూడా ఉంది. ఈ సినిమా 2027 మార్చి 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.