నెలవంకలాంటి ఒత్తైన నల్లటి కనుబొమ్మలు కావాలంటే..
Jyothi Gadda
01 November 2026
అందమైన, దట్టమైన కనుబొమ్మలు మీ ముఖ సౌందర్యాన్ని మరింత పెంచుతాయి కాబట్టి వాటి సంరక్షణ చాలా ముఖ్యం.
కొబ్బరి నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్స్ కనుబొమ్మల ఫోలికల్స్‌కు చక్కటి పోషణను అందిస్తాయి.
కొబ్బరి నూనెను రోజూ రాత్రి పూట రాయడం ద్వారా కనుబొమ్మలు వేగంగా, ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.
ఆలివ్ ఆయిల్, విటమిన్ ఇ ఆయిల్, ఆముదం కలిపి తయారు చేసిన సీరం కనుబొమ్మలకు అద్భుతంగా పనిచేస్తుంది.
లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్‌ను కొబ్బరి నూనెతో కలిపి అప్లై చేయడం వల్ల కనుబొమ్మల వెంట్రుకలు రాలిపోవడం పూర్తిగా నివారించవచ్చు.
చిన్న బ్రష్‌తో కనుబొమ్మలను క్రమం తప్పకుండా వృత్తాకార కదలికలలో రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవడం చాలా మంచిది.
కనుబొమ్మలు మరీ సన్నగా కాకుండా సరైన ఆకృతిలో ఉండేలా ఎప్పుడూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
రోజూ తీసుకునే ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలను చేర్చడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
రోజూ ఒక కప్పు ఉడికించిన సోయాబీన్స్ తిన్నారంటే..ఈ సమస్యలన్నీ పరార్!
ఈ దిశలో మందార మొక్కను నాటితే ఐశ్వర్యం మీ వెంటే!
వర్షాకాలంలో రాగులు వాడుతున్నారా..? ఇది తెలుసుకోండి..!