Alia Bhatt: హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న ఆర్ఆర్ఆర్ బ్యూటీ.. అలియాకు సక్సెస్ వచ్చినట్టేనా ?..
హార్డ్ ఆఫ్ స్టోన్ అనే సినిమా ద్వారా హాలీవుడ్ ఎంట్రీ చేయబోతున్నా.. చిత్రీకరణలో పాల్గొనేందుకు అమెరికా వెళ్తున్నాను.. సినిమా ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్నప్పటికీ
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ (Alia Bhatt ).. వివాహం తర్వాత మరింత జోరు పెంచింది. పెళ్లైన కొద్ది రోజులకే షూటింగ్స్లోనూ పాల్గోంటూ ప్రాజెక్టులను ఫినిష్ చేసే పనిలో పడింది ఈ ముద్దుగుమ్మ.. ఎప్పటికప్పుడు వినూత్న కథా చిత్రాల్ని ఎంచుకుంటూ .. ప్రాధాన్యత ఉన్న రోల్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అలియా.. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు.. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. హార్డ్ ఆఫ్ స్టోన్ అనే హాలీవుడ్ సినిమా చేయబోతుంది అలియా..
హార్డ్ ఆఫ్ స్టోన్ అనే సినిమా ద్వారా హాలీవుడ్ ఎంట్రీ చేయబోతున్నా.. చిత్రీకరణలో పాల్గొనేందుకు అమెరికా వెళ్తున్నాను.. సినిమా ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్నప్పటికీ హాలీవుడ్ అనుభవం మాత్రం కొత్తగా అనిపిస్తుంది. కాస్త ఒత్తిడిగా ఫీల్ అవుతున్నా.. టెన్షన్ గా ఉంది.. అంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది అలియా.. ఇప్పటికే ప్రియాంకచోప్రా, దీపికా పదుకోన్ హాలీవుడ్ అవకాశాలు అందుకుని సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
View this post on Instagram