AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Leukemia: లుకేమియా ఇకపై ప్రాణాంతకం కాదు.. బోన్ మ్యారో సర్జరీ సక్సెస్ పై వైద్యుల కీలక ప్రకటన

లుకేమియా(Leukemia) వ్యాధి గురించి ఇకపై భయాందోళన చెందాల్సిన పని లేదని డాక్టర్లు వెల్లడించారు. ఎముక మజ్జ(Bone Marrow) మార్పిడితో ఈ వ్యాధిని పూర్తిగా తొలగించవచ్చని తెలిపారు. ఇలాంటి ప్రక్రియ విజయవంతం కావడం ఆనందంగా...

Leukemia: లుకేమియా ఇకపై ప్రాణాంతకం కాదు.. బోన్ మ్యారో సర్జరీ సక్సెస్ పై వైద్యుల కీలక ప్రకటన
Luekemia
Ganesh Mudavath
|

Updated on: May 21, 2022 | 8:36 AM

Share

లుకేమియా(Leukemia) వ్యాధి గురించి ఇకపై భయాందోళన చెందాల్సిన పని లేదని డాక్టర్లు వెల్లడించారు. ఎముక మజ్జ(Bone Marrow) మార్పిడితో ఈ వ్యాధిని పూర్తిగా తొలగించవచ్చని తెలిపారు. ఇలాంటి ప్రక్రియ విజయవంతం కావడం ఆనందంగా ఉందన్నారు. అంతకుముందు బ్లడ్ క్యాన్సర్(Blood Cancer) వస్తే మరణశిక్షేనని భావించేవాళ్లు.. కానీ ప్రస్తుతం అందుబాటులో వచ్చిన వైద్యంతో ఆ భయాన్ని జయించగలిగామని వ్యాఖ్యానించారు. ఎముక మజ్జ మార్పిడి చేయాలనే వ్యక్తికి రోగికి రక్త సంబంధం ఉంటే మజ్జ మార్పిడి 90 శాతం విజయవంతం అవుతుందని చెప్పారు. కణాలు ఎంత వేగంగా యాక్టీవ్ అవుతున్నాయన్న అంశంపై చికిత్స ఆధారపడి ఉంటుందన్నారు. సాధారణంగా ఇందుకు 14-21 రోజుల సమయం పడుతుంది. కిడ్నీలు, రక్త కణాల మార్పిడి ప్రక్రియల విషయానికి ఒక పెద్ద తేడా ఉంది. “కిడ్నీ మార్పిడి చేయించుకున్న రోగులకు జీవితాంతం మందులు వాడాలి. కానీ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌లో, రోగులు ఒక సంవత్సరం లోపు మందులు మానేసి, ఆ తర్వాత సాధారణ జీవితాన్ని గడపవచ్చు. అదే బ్లడ్ క్యాన్సర్ అయితే, సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది. రోగి క్షేమంగా ఉంటే, ఇంకా ఏవీ ఆలోచించాల్సిన అవసరం లేదు”.

అయితే.. బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న రోగులు రెగ్యులర్ గా చెకప్‌లకు వెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ చికిత్స చేసేందుకు వయసులో పని లేదు. నాలుగు నెలల వయస్సు ఉన్న శిశువులు కూడా ఈ వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది. అంతే కాకుండా సాంకేతికత, ఆధునిక పరికరాల సహాయంలో ప్రస్తుతం 70-80 సంవత్సరాల వయస్సు గల రోగులకూ ఈ ప్రక్రియను నిర్వహించడం సాధ్యమవుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి ఐదు నిమిషాలకు ఒకరు అనీమియా, తలసేమియా వంటి రక్త సంబంధ రోగాలకు గురవుతున్నారని పాట్రిక్ పాల్ అన్నారు.

స్టెమ్ సెల్ డోనర్ అనే విషయంలో చాలా మందికి అపోహలు ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి మరొకరి కోసం చేయగలిగిన ఉత్తమమైన వాటిలో ఇది ఒకటి. రక్తం ఇచ్చినట్లే, ఒక సాధారణ రక్త పరీక్ష వలె దాతలు బోన్ మ్యారోను డొనేట్ చేయవచ్చు. వారికి ఎటువంటి సమస్యలు రావు. వారు కేవలం కొన్ని రకాల మందులు వాడాల్సి వస్తుంది. కానీ.. ప్రస్తుత పరిస్థితుతల్లో దాత కుటుంబ సభ్యుడు అయితేనే బోన్ మ్యారో తీసేందుకు అంగీకరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీ చదవండి

FIFA 2022: ఫిఫా 2022 ప్రపంచ కప్‌కు సిద్ధమవుతున్న ఖతార్.. తగ్గేదే లేదంటూ..

Ipad: మారుతున్న కాలానికి రోజుకో రంగు..! గుడ్‌బై ఐపోడ్‌.. 20 ఏళ్ళ టెక్‌ వండర్‌కి వీడ్కోలు..