AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kumari Aunty: అయ్యో! కుమారి ఆంటీకి ఎంత కష్టమొచ్చింది! గ్యాస్ సిలిండర్ల కొరతతో బిజినెస్ డల్.. చివరకు..

గ్యాస్ సిలిండర్ల కొరతతో వ్యాపార సముదాయాలు కుప్పుకూలుతున్నాయి. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ తదితర నగరాల్లోని పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్స్ మూత పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సిలిండర్ల సరఫరా లేకపోవడంతో సోషల్ మీడియా సెన్సేషన్ కుమారీ ఆంటీ స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ కూడా బాగా దెబ్బతింది.

Kumari Aunty: అయ్యో! కుమారి ఆంటీకి ఎంత కష్టమొచ్చింది! గ్యాస్ సిలిండర్ల కొరతతో బిజినెస్ డల్.. చివరకు..
Kumari Aunty
Basha Shek
|

Updated on: Mar 12, 2026 | 7:46 PM

Share

సోషల్ మీడియా సెన్సేషన్ కుమారి ఆంటీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హైదరాబాద్‌ మాదాపూర్‌ ఐటీసీ కోహినూర్ సమీపంలో స్ట్రీట్ ఫుడ్ అమ్ముతూ నెట్టింట బాగా వైరల్ అయ్యారామె. వెజ్, నాన్ వెజ్ భోజనాలను సరసమైన ధరలకే రుచికరంగా అందిస్తుండడంతో ఆమె వద్దకు ఫుడ్ లవర్స్ క్యూ కట్టారు. అలాగే ఫుడ్ వ్లాగర్స్, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబ్ వాళ్లు క్యూ కట్టారు. దీంత ట్రాఫిక్ జామ్ ఏర్పడడం, ఫుడ్ స్టాల్ తీసేయాలని పోలీసులు ఆదేశాలు జారీచేయడం, చివరకు సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవడం.. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో కుమారీ ఆంటీ పేరు బాగా మార్మోగిపోయింది. ఆ మధ్యన జబర్దస్త్ తో పాటు కొన్ని టీవీ షోల్లోనూ సందడి చేశారామె. ఇప్పుడు వంట గ్యాస్ కొరత నేపథ్యంలో మరోసారి వార్తల్లో నిలిచింది కుమారి ఆంటీ. గత కొద్ది రోజులుగా సిలిండర్ల సరఫరా సరిగ్గా లేకపోవడంతో ఆమె స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ డల్‌గా సాగుతోందట. సాధారణంగా రకరకాల వంటకాలు, కూరలతో కస్టమర్లను ఆకట్టుకునే ఆమె ఇప్పుడు గ్యాస్ కొరతతో ఎక్కువ రకాల కూరలు వండలేకపోతుందట. ఈ మేరకు ఓ టీవీ ఛానెల్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది కుమారి ఆంటీ.

హైదరాబాద్ మార్కెట్లో కమర్షియల్ సిలిండర్ల పరిస్థితి దారుణంగా మారింది. దాదాపు 8 వేల రూపాయలు పెడతామన్నా కూడా సిలిండర్లు దొరకని పరిస్థితి. పోనీ ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యి మీద వంట చేద్దామంటే, ఇంటి ఓనర్లు ససేమిరా అంటున్నారు. చివరకు గత్యంతరం లేక చిన్న చిన్న గ్యాస్ సిలిండర్లను 6 వేల రూపాయలకు కొనుగోలు చేసి వంటలు చేస్తున్నాను. ఈ గ్యాస్ కొరతతో నా బిజినెస్ బాగా డల్ అయిపోయింది. లాభాల కంటే నష్టాలే ఎక్కువగా వస్తున్నాయి. అయినా సరే కస్టమర్ల కోసం నష్టాలను భరిస్తూనే బిజినెస్ భరిస్తూనే ఉన్నాను. బయట హోటళ్లలో రేట్లు పెరిగినప్పటికీ నేను మాత్రం పాత ధరలకే కస్టమర్లకు భోజనం అందిస్తున్నాను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ప్రజలే నాకు అండగా నిలిచారు. ఆ కృతజ్ఞతా భావంతోనే ధరలు పెంచకుండా భోజనం అందిస్తున్నాను. ప్రభుత్వం త్వరలోనే దీనిపై ఒక మంచి నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చింది కుమారి ఆంటీ.

ఇవి కూడా చదవండి

కుమారీ ఆంటీ లేటెస్ట్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అయ్యో! కుమారి ఆంటీకి ఎంత కష్టమొచ్చింది!
అయ్యో! కుమారి ఆంటీకి ఎంత కష్టమొచ్చింది!
సరైనోడు సినిమాలో ఆ రోల్ నేను చేయాల్సింది.. కానీ..
సరైనోడు సినిమాలో ఆ రోల్ నేను చేయాల్సింది.. కానీ..
హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ బంపర్ ఆఫర్.. వెంటనే కడితే 90శాతం..
హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ బంపర్ ఆఫర్.. వెంటనే కడితే 90శాతం..
శుక్రుడి అనుకూలత.. వ్యక్తిగత జీవితంలో వారికన్నీ విజయాలే..!
శుక్రుడి అనుకూలత.. వ్యక్తిగత జీవితంలో వారికన్నీ విజయాలే..!
ఏం కష్టాలు సామీ..! గ్యాస్ లేదని వాటర్ హీటర్‌తో వంట చేస్తున్నారు!
ఏం కష్టాలు సామీ..! గ్యాస్ లేదని వాటర్ హీటర్‌తో వంట చేస్తున్నారు!
సినిమాల్లో గ్లామర్ సెన్సేషన్.. ఇప్పుడు ప్రతిరోజూ నరకమే అంటూ కామెం
సినిమాల్లో గ్లామర్ సెన్సేషన్.. ఇప్పుడు ప్రతిరోజూ నరకమే అంటూ కామెం
ఏపీలో మరో కొత్త హైవే.. బెంగళూరుకు 8 గంటల్లోనే ప్రయాణం..
ఏపీలో మరో కొత్త హైవే.. బెంగళూరుకు 8 గంటల్లోనే ప్రయాణం..
బిగ్ న్యూస్.. పెట్రోల్ రేట్ల పెంపుపై కేంద్రం సంచలన ప్రకటన..!
బిగ్ న్యూస్.. పెట్రోల్ రేట్ల పెంపుపై కేంద్రం సంచలన ప్రకటన..!
విజయ్‏కు దెబ్బ మీద దెబ్బ.. రూ.120 కోట్ల డీల్ క్యాన్సిల్..
విజయ్‏కు దెబ్బ మీద దెబ్బ.. రూ.120 కోట్ల డీల్ క్యాన్సిల్..
17 నిమిషాల రేప్ సీన్ తో కాంట్రవర్సీ..కట్ చేస్తే కలెక్షన్ల వర్షం
17 నిమిషాల రేప్ సీన్ తో కాంట్రవర్సీ..కట్ చేస్తే కలెక్షన్ల వర్షం