Congo Hippos: ఆ గ్రామాన్ని హడలెత్తిస్తున్న హిప్పోలు.. ఏకంగా ఏడుగురిని చంపేశాయి.. మరికొందరిని..
శాకాహార జీవులైన హిప్పోలు ఎక్కువగా నీటిలోనే ఉంటాయి.. ఆహారం కోసం ఎక్కువగా రాత్రి వేళ ఒడ్డుకు వస్తాయి.. ఈ జీవులు తమకు ప్రమాదం అనిపిస్తే అవతలి వారిపై క్రూరంగా దాడి చేస్తాయి..
Congo Hippos: కాంగోలోని ఆ గ్రామానికి హిప్పోలు ప్రమాదకరంగా మారాయి. ఇప్పటికే ఏడుగురిని చంపేశాయి.. ఇప్పుడు ఆ గ్రామస్తులంతా బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. హిప్పోపోటమస్.. వీటని మనం నీటి గుర్రాలు అని పిలుస్తాం.. ఏనుగుల్లానే భారీ ఆకారంతో భీకరంగా కనిపిస్తాయి.. శాకాహార జీవులైన హిప్పోలు ఎక్కువగా నీటిలోనే ఉంటాయి. ఆహారం కోసం ఎక్కువగా రాత్రి వేళ ఒడ్డుకు వస్తాయి. ఈ జీవులు తమకు ప్రమాదం అనిపిస్తే అవతలి వారిపై క్రూరంగా దాడి చేస్తాయి. ఇలాంటి పరిస్థితే ఆఫ్రికా ఖండంలోని ఓ గ్రామంలో కనిపిస్తోంది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో- బురుండి దేశాలను వేరు చేస్తే ప్రవహించే రుజిజి నదిలో పెద్ద సంఖ్యలో హిప్పోలు కనిపిస్తాయి. ఈ నది నది ఒడ్డున అనేక గ్రామాలున్నాయి. ఇందులో ఒకటి కటకొటా ఊరు.. ఈ గ్రామ ప్రజలు నది ఒడ్డుకు వెళ్లేందుకే భయపడిపోతున్నారు. ఆహారం కోసం బయటకు ఒడ్డుకు వచ్చే హిప్పోలు మనుషుల మీద పడి ప్రాణాలు తీస్తున్నాయి. 2019 నుంచి ఇప్పటి వరకూ హిప్పోల దాడిలో ఏడుగురు మరణిస్తే, ఆరుగురు గాయపడ్డారు.
హిప్పోలను పరిరక్షించాలని పర్యావరణవాదులు, జంతు ప్రేమికులు కోరుతున్నారు.. వీటిని పర్యాటకరంగ అభివృద్దికి ఉపయోగిస్తే గ్రామస్తులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెబుతున్నారు. హిప్పోలతో హద్దుల్లో ఉంటూ సహజీవనం సాగించాలంటున్నారు. కానీ పెద్ద సంఖ్యలో పెరిగిపోయిన హిప్పోలు గ్రామాలపై దాడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ప్రభుత్వమే ఈ సమస్యకు తగిన పరిష్కారం చూపించాలని కోరుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..