AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రిటిష్ రాజు చార్లెస్ సోదరుడు ఆండ్రూ మౌంట్ బాటెన్ అరెస్ట్.. ఎందుకో తెలుసా!

బ్రిటన్ రాజు చార్లెస్ III తమ్ముడు, మాజీ ప్రిన్స్ ఆండ్రూ మౌంట్ బాటన్ అరెస్టు అయ్యారు. ఇటీవల US ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో అతని పేరు బయటకు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇదే అతిపెద్ద చర్య. బ్రిటన్ రాజు చార్లెస్ తమ్ముడు, మాజీ ప్రిన్స్ ఆండ్రూ మౌంట్‌బాటన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

బ్రిటిష్ రాజు చార్లెస్ సోదరుడు ఆండ్రూ మౌంట్ బాటెన్ అరెస్ట్.. ఎందుకో తెలుసా!
Andrew Mountbatten
Balaraju Goud
|

Updated on: Feb 19, 2026 | 4:08 PM

Share

బ్రిటన్ రాజు చార్లెస్ III తమ్ముడు, మాజీ ప్రిన్స్ ఆండ్రూ మౌంట్ బాటన్ అరెస్టు అయ్యారు. ఇటీవల US ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో అతని పేరు బయటకు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇదే అతిపెద్ద చర్య. బ్రిటన్ రాజు చార్లెస్ తమ్ముడు, మాజీ ప్రిన్స్ ఆండ్రూ మౌంట్‌బాటన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బిబిసి కథనం ప్రకారం, బ్రిటిష్ ప్రత్యేక పోలీసులు గురువారం (ఫిబ్రవరి 19) తూర్పు ఇంగ్లాండ్‌లోని సాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌లోని వుడ్ ఫామ్‌లో ఆండ్రూను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అరెస్టు చేయడానికి ఎనిమిది మంది అధికారులు సాధారణ దుస్తులలో వచ్చారు.

బ్రిటిష్ పోలీసులు తన పదవిని దుర్వినియోగం చేశారనే అనుమానంతో అతన్ని అరెస్టు చేశారు. లైంగిక వేధింపుల నిందితుడు జెఫ్రీ ప్‌స్టీన్‌కు ప్రభుత్వ పత్రాలను అందించాడని ఆండ్రూపై ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.  ఆండ్రూ ద్వారా ప్‌స్టీన్‌కు ఏయే రహస్య పత్రాలు అందించారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు పేర్కొ్న్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us