ఉల్లి కాడలు, పచ్చి రొయ్యలు ఇలా వండితే.. రెండు పూటలా తినేది ఒక్క పూటే తింటారు!

Prasanna Yadla

19 February 2026

Pic credit - Pixabay

రొయ్యలను ఎంతో మంది ఇష్టంగా తింటారు. ఎందుకంటే, దీనిలో మనకీ కావాల్సిన పోషకాలు ఉన్నాయి. 

రొయ్యలు 

ఉల్లికాడలను కొందరు పక్కన పడేస్తారు. కానీ, వాటి వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి

ఉల్లికాడలు

ఈ రెండింటి కాంబోలో కూర చేస్తే అది నెక్స్ట్ లెవెల్ ఎందుకంటే, ఇలాంటి రుచి ఎక్కడా కూడా దొరకదు. 

ఉల్లికాడలతో పచ్చిరొయ్యలు కూర

అరకిలో పచ్చిరొయ్యలు, రెండు కప్పులు ఉల్లికాడలు , 6 పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్స్ కారం,  ఒక టేబుల్ స్పూన్ ధనియాలపొడి, అర టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పును వేస్తే సరిపోతుంది.

కావాల్సిన పదార్దాలు

ఒక టేబుల్ అల్లంవెల్లుల్లి పేస్ట్,  నూనె , చెంచాలు, కరివేపాకు , కొత్తిమీర,  అర టీ స్పూన్ జీలకర్ర,  దాల్చినచెక్క తీసుకోవాలి.

వీటితో పాటు.. 

ముందుగా రొయ్యలను బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి.  వాసన ఇంకా అలాగే వస్తే ఉప్పు, నిమ్మరసంతో మళ్ళీ శుభ్రం చేయండి. ఇప్పుడు అల్లంవెల్లుల్లి పేస్ట్ కూడా రొయ్యలకు పట్టించి 40 నిముషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

స్టెప్ -1 

ఇప్పుడు పాన్ పొయ్యి మీద పెట్టి ఉల్లికాడలు, పచ్చి మిర్చి వేసి బాగా వేయించుకోవాలి. దానిలో జీలకర్ర, దాల్చినచెక్క కూడా వేయాలి. దీనిని కాసేపు పక్కన పెట్టుకోండి.

స్టెప్ -2

ఇక ఇప్పుడు మ్యారినేట్ చేసిన పచ్చిరొయ్యలు తీసుకుని ఉల్లికాడల్లో వేసి  బాగా కలుపుకోవాలి. ఇక కొద్దిగా నీళ్ళు పోసి 15 నిముషాల ఉడకనివ్వండి. అంతే, ఉల్లికాడలు పచ్చిరొయ్యలు కూర రెడీ.

 ఉల్లికాడలు పచ్చిరొయ్యలు కూర రెడీ