వైభవంగా శ్రీముఖలింగేశ్వరుని చక్రతీర్థ స్నానం
శ్రీకాకుళం జిల్లాలోని దక్షిణ కాశీగా పేరొందిన శ్రీముఖలింగ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మిక శోభతో జరిగాయి. అత్యంత కీలకమైన చక్రతీర్థ స్నాన మహోత్సవం వంశధార నదీ తీరంలో వైభవంగా నిర్వహించారు. శ్రీ ముఖలింగేశ్వర స్వామివారి గంగా స్నానం అనంతరం, వేలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు చేసి, పాప విముక్తి పొందారని విశ్వసించారు. పొరుగు రాష్ట్రాల భక్తులతో వంశధార తీరం మార్మోగింది.
దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగ క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో పరవశించిపోయింది. మహాశివరాత్రి ఉత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన చక్రతీర్థ స్నాన మహోత్సవం మంగళవారం వంశధార నదీ తీరంలో అత్యంత వైభవంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తుల జయజయధ్వానాల మధ్య స్వామివారు గంగా స్నానమాచరించారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీ ముఖలింగేశ్వర స్వామివారు తన సతీసమేతంగా నంది వాహనం అధిష్టించి, ఆలయం నుండి వంశధార నది వరకు ఊరేగింపుగా బయలుదేరారు. మంగళవాయిద్యాలు, భక్తజన కోలాహలం, వేద మంత్రోచ్ఛారణల మధ్య సాగిన ఈ శోభాయాత్రను తిలకించేందుకు భక్తులు ఇరువైపులా పెద్ద సంఖ్యలో బారులు తీరారు. నదీ తీరానికి చేరుకున్న ఉత్సవ మూర్తులకు అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం వంశధార నదిలో స్వామివారికి చక్రతీర్థ స్నానం ఆచరించారు. స్వామివారి స్నానం పూర్తయిన వెంటనే, నదీ దిగువన వేచి ఉన్న వేలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. ఈ తీర్థ స్నానంతో తమ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ముక్కంటి దర్శనం కోసం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుండి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. “ఓం నమః శివాయ” అనే పంచాక్షరీ మంత్రంతో వంశధార నదీ తీరం మార్మోగింది. భక్తుకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అటవీ, పోలీసు అధికారులు, ఆలయ అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు
పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..
సాయం కావాలని ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి !! చివరికి
తాళి కట్టే సమయానికి రద్దయిన వివాహం.. అసలు వాడు మగాడే కాదా?
Cow: తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్ అధికారులకు పట్టించిన ఆవు..
ప్రపంచంలోని ఇరుకైన వీధి !! ఎక్కడ ఉందొ తెలుసా
ఇదెక్కడి వాతావరణం.. ఇక్కడేమో ఎండలు.. అక్కడేమో వర్షాలు
రైల్వే ట్రాక్‌ను కమ్మేసిన పొగ..నిలిచిపోయిన రైలు
ఆ దేశంలో ఆఫీసులు .. స్వర్గానికి స్పాట్లు
వీళ్లు మనుషులేనా.. పెళ్లిలోనే పొట్టు పొట్టు కొట్టుకున్నారు కదా!
గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్.. ముప్పు తప్పదా?
ఏలియన్స్ నిజంగా ఉన్నారా? ఆ సీక్రెట్ ఫైల్స్‌లో ఏముంది?

