పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..
రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఓ వివాహ రిసెప్షన్‌లో పెళ్లి కూతురు పక్కనే ఉన్న బ్యాగ్‌ను దొంగ ఎత్తుకెళ్లాడు. రూ.4 లక్షల నగదు, ఆభరణాలు చోరీ అయ్యాయి. బంధువులా వచ్చి, ఆశీర్వదించి, భోజనం చేసి, చేతివాటం ప్రదర్శించాడు. పెళ్లిళ్లలో చోరీలకు కారణాలు, నివారణ చర్యలపై ఈ కథనం. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
ఓ వివాహ వేడుకలో భారీ చోరీ కలకలం రేపింది. బంధుమిత్రుల సందడి మధ్య దర్జాగా వచ్చిన ఓ దొంగ పెళ్లి కూతురు పక్కనే ఉన్న 4 లక్షల రూపాయలున్న బ్యాగ్‌ను ఎత్తుకెళ్లాడు. ఈ దృశ్యాలు అక్కడి కెమెరాల్లో రికార్డయ్యాయి. కాఫీలు తాగారా.. టిఫీనీలు చేశారా! ఒక సినిమాలో పెళ్లింట ఆత్మీయత ఒలకబోస్తారు కొందరు. చివర్లో వస్తువులు కొట్టేసే దొంగలుగా బయటపడతారు. సినిమాలో నవ్వించిన పాత్రలు.. ప్రస్తుతం వివాహాలు జరిగే ప్రాంతానికి వచ్చి అదను చూసి అందినంత కాజేసి మాయమవుతున్నారు. ఖరీదైన ఇంట వివాహమంటే వారంరోజుల ముందు నుంచే హంగామా.. అక్కడికి వచ్చిన వారిలో బంధుమిత్రుల ఎవరనేది గుర్తించటం కష్టం. కుటుంబం పెళ్లి పనుల్లో బిజీగా ఉంటారు. అక్కడక్కడ ప్రైవేటు సెక్యూరిటీ ఉన్నా చూసీచూడనట్టు వదిలేస్తారు. దీన్ని అవకాశం చేసుకున్న మాయగాళ్లు తెలివిగా వివాహ మండపం దగ్గరికి చేరుతున్నారు. అతిథులు మాదిరిగానే పెళ్లిపీటలపై వధూవరులను ఆశీర్వదిస్తారు. కడుపారా భోజనం చేసి నెమ్మదిగా చేతివాటం ప్రదర్శిస్తారంటూ పోలీసులు చెబుతున్నారు. రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఫిబ్రవరి 7న ఓ రిసెప్షన్ ఘనంగా జరిగింది. వేదికపై కొత్త దంపతులు ఆశీర్వాదం తీసుకుంటున్నారు. అంతా పెళ్లి సందడిలో ఉండగా, ఖరీదైన సూటు ధరించిన ఓ యువకుడు అతిథిలా వేదికపైకొచ్చాడు. ఎవరికీ అనుమానం రాకుండా వధూవరుల వెనుక వైపుగా వెళ్లాడు. వధువు పక్కనే ఉన్న బ్యాగును కొట్టేశాడు. బ్యాగును తన బ్లేజర్ లోపల దాచుకుని అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. బ్యాగులో 4 లక్షల క్యాష్‌తో పాటు బంగారు ఆభరణాలు ఉన్నట్లు బాధితులు వాపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెళ్లి వీడియో ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వారికి ఆ రైళ్లల్లో ఎమర్జెన్సీ కోటా.. బెర్త్ పొందడం ఎలా ??
ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు
పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..
ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు
సిమ్ కార్డుల నుంచి బంగారం తీశాడు !! ఎలాగంటే
ఈ పక్షికి ఒళ్లంతా విషమే.. ముట్టుకుంటే మరణమే!
సముద్రంలో సరదా విహారం.. ప్రాణాల మీదికొచ్చింది..
కోటిన్నరకు భర్తను అమ్మేసిన భార్య.. కారణం ఇదే !! మహానుభావురాలు
ప్రాణం తీసిన గ్రైండర్.. ఈ తప్పులు అస్సలు చేయకండి

