AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారికి ఆ రైళ్లల్లో ఎమర్జెన్సీ కోటా.. బెర్త్ పొందడం ఎలా ??

వారికి ఆ రైళ్లల్లో ఎమర్జెన్సీ కోటా.. బెర్త్ పొందడం ఎలా ??

Phani CH
|

Updated on: Feb 19, 2026 | 11:33 AM

Share

వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్ రైళ్లలో రైల్వే శాఖ ఎమర్జెన్సీ కోటాను తిరిగి ప్రారంభించింది. మెడికల్, అధికారిక, కుటుంబ అత్యవసర ప్రయాణాలకు ఈ బెర్తులను సాధారణ ప్రజలు కూడా పొందవచ్చు. ఆన్‌లైన్‌లో కాకుండా, ప్రయాణానికి ఒక రోజు ముందు దరఖాస్తు చేసుకోవాలి. ఏసీ కోచ్‌లలో 4 నుంచి 42 బెర్తుల వరకు అందుబాటులో ఉంటాయి. ఈ సౌకర్యంతో అత్యవసర సమయాల్లో ప్రయాణం సులభతరం అవుతుంది.

వందే భారత్ స్లీపర్, అమృత్ భారత్ రైళ్లలో ఎమర్జెన్సీ కోటాను రైల్వే శాఖ తాజాగా పునరుద్ధరించింది. ఈ రైళ్లలో ఇప్పటి వరకూ మహిళలు, వికలాంగులు, సీనియర్ సిటిజన్స్, డ్యూటీ పాస్ హోల్డర్లకు మాత్రమే ప్రత్యేక కోటాలు ఉండేవి. కానీ, ప్రయాణికుల అవసరాలు, బెర్తుల అందుబాటును పరిగణనలోకి తీసుకుని ఈ కోటాను పునరుద్ధరించాలని రైల్వే నిర్ణయం తీసుకుంది. ఏడు లేదా అంత కంటే ఎక్కువ బోగీలు ఉండే అమృత్ భారత్ రైళ్లల్లో 24 ఎమర్జెన్సీ బెర్తులు అందుబాటులో ఉంటాయి. వందే భారత్ స్లీపర్‌ రైళ్ల విషయానికి వస్తే.. ఫస్ట్‌ క్లాస్ ఏసీలో సాధారణ రోజుల్లో నాలుగు, వారాంతాల్లో ఆరు ఎమర్జెన్సీ బెర్తులు, టూటైర్ ఏసీలో సాధారణ రోజుల్లో 24 బెర్తులు, వారాంతాల్లో 30 బెర్తులు, థర్డ్ ఏసీ బోగీల్లో సాధారణ రోజుల్లో 24 బెర్తులు, వారాంతాల్లో 42 బెర్తులు అత్యవసర బెర్తులు అందుబాటులో ఉంచాలి. అత్యవసర సందర్భాల్లో ప్రయాణాలకు వీలుగా ఎమర్జెన్సీ కోటాను రైల్వే అందుబాటులోకి తెచ్చింది. మెడికల్ ఎమర్జెన్సీ, అధికారిక విధుల్లో భాగంగా ప్రయాణాలు, కుటుంబంలో అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు వీటిని వినియోగించుకోవచ్చు. ఈ కోటాలో బెర్తులను సాధారణంగా ఉన్నతాధికారులు ఎక్కువగా వాడుకుంటారు. కానీ, సాధారణ ప్రజలు కూడా అవసరమైన పత్రాలతో ఈ కోటాలో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. వీటిని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోలేరు. ప్రయాణానికి కనీసం ఒక రోజు ముందు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకుంటే.. పూర్తి వివరాలను పరిశీలించిన తర్వాతే అనుమతిస్తారు. తొలి వందేభారత్ స్లీపర్ రైలు.. కోల్‌కతా- గౌహటి మధ్య జనవరి 17 ప్రారంభమైంది. దీనిని దశలవారీగా సూదూర ప్రాంతాల మధ్య అందుబాటులోకి తెస్తున్నారు. ప్రస్తుతం పగటి పూట ప్రయాణించే వందేభారత్ ఛైర్‌కార్ రైళ్లకు మంచి ఆధరణ లభిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు

Follow Us