సాయం కావాలని ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి !! చివరికి
గాయపడిన పక్షులు, జంతువులకు ప్రకృతి వైద్యం తెలిసినా, మనుషుల వల్ల కలిగే గాయాలకు అవి నిస్సహాయంగా ఉంటాయి. పవర్ లైన్లు, వలలు, వ్యర్థాల వల్ల అవి తీవ్రంగా గాయపడుతున్నాయి. కోయంబత్తూరులో ప్రారంభమైన పక్షుల పునరావాస కేంద్రాలు వాటి ప్రాణాలను కాపాడుతున్నాయి. జర్మనీలో చేపల గాలం గుచ్చుకున్న ఒక పక్షి స్వయంగా ఆసుపత్రి సహాయం కోరింది. ఇలాంటి మానవ సహాయం పక్షులకు చాలా అవసరం.
సాధారణంగా పక్షులు, జంతువులకు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా లేదా గాయపడినా అవి ఆస్పత్రులకు వెళ్లవు. వాటికి వాటంతట అవే తగ్గిపోతాయి. లేదా వాటికి తెలిసిన ప్రకృతి వైద్యం ఆకులు అలములు తిని నయం చేసుకుంటాయి.. అయితే పక్షులకు మనిషి నుంచే ప్రమాదం పొంచి ఉంది. వాడి పడేసిన వస్తువుల కోసం ఎగురుకుంటూ వచ్చే పక్షులు గాయాలపాలవుతున్నాయి. విద్యుత్ తీగలు, వేటగాళ్ల వలలకు చిక్కి అల్లాడుతున్నాయి. సకాలంలో గుర్తించి రక్షించక పోతే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. గాయపడిన పక్షులకు హాస్పిటల్ ఉంటే చాలా వరకు బతుకుతాయి. కోయంబత్తూరు అటవీ సిబ్బంది ఓ స్వచ్ఛంద సంస్థ సహాయంతో ‘పక్షుల పునరావాస కేంద్రాన్ని’ ప్రారంభించారు. గాయపడిన పక్షులను రక్షించి, చికిత్స అందిస్తుంటారు. జర్మనీలోని తీర ప్రాంతాల్లో నివసించే ఓ పక్షికి పెద్ద కష్టమే వచ్చింది. ఎలా జరిగిందో కానీ ఓ చేపల గాలం కాస్తా దాని ముక్కులోకి గుచ్చుకుంది. బాధతో ఆ పక్షి దగ్గర్లోని ఓ భవనం తాలూకు అద్దాల తలుపును ముక్కుతో పదేపదే కొట్టి సాయం అర్థించింది! అది ఓ ఆస్పత్రి తాలూకు ఎమర్జెన్సీ గది కావడం విశేషం! తలుపు తట్టిన చప్పుళ్లు విని అక్కడికొచ్చిన ఆస్పత్రి సిబ్బంది పక్షిని చూసి ఆశ్చర్యపోయారు. దాని బాధ గమనించి దానిని లోపలికి తీసుకెళ్లారు. గాలాన్ని జాగ్రత్తగా తీసిన గాయానికి చికిత్స చేసారు. ఈ వింత ఘటన జర్మనీలోని బార్మెన్ నగరంలో ఆదివారం జరిగింది. ఆ పక్షిని కోర్మరాంట్‌గా పిలుస్తారు. ప్రధానంగా సముద్ర తీర ప్రాంతాలు వీటి ఆవాసం. చివరన కిందివైపుకు మెలిదిరిగి ఉండే ముక్కు వీటి ప్రత్యేకత.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..
వారికి ఆ రైళ్లల్లో ఎమర్జెన్సీ కోటా.. బెర్త్ పొందడం ఎలా ??
ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు
స్కూల్ హెడ్మాస్టర్ నిర్వాకం.. పిల్లలతో మసాజ్..
రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఎగబడిన జనం.. మరి మీకు కావాలా..
లైవ్ వీడియోలో యూట్యూబర్ ఆత్మహత్యా యత్నం.. బాబోయ్
అయ్యో లోతైన బావిలోపడిపోయిన ఏనుగుపిల్ల.. ఎలా బయటపడిందంటే
Viral Video: కారులో కోబ్రా.. షాక్లో యజమాని
వీడసలు భర్తేనా.. కట్టుకున్న భార్యను ఎరగా వేసి.. కుర్రాడిని..
విధి ఆడిన వింత నాటకం.. భర్తను బలిగొన్న కరెంటు తీగ

