AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తాళి కట్టే సమయానికి రద్దయిన వివాహం.. అసలు వాడు మగాడే కాదా?

తాళి కట్టే సమయానికి రద్దయిన వివాహం.. అసలు వాడు మగాడే కాదా?

Phani CH
|

Updated on: Feb 19, 2026 | 11:52 AM

Share

యూపీలోని బారాబంకిలో జరిగిన ఘనమైన పెళ్లి వేడుకలో పెను సంచలనం చోటుచేసుకుంది. ఊరేగింపు గ్రాండ్‌గా సాగినా, పెళ్లి మండపంలో వరుడు ట్రాన్స్‌జెండర్ (అమ్మాయి నుండి అబ్బాయిగా మారిన వ్యక్తి) అని తెలియడంతో వధువు కుటుంబం, అతిథులు షాక్‌కి గురయ్యారు. ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకుని వివాహాన్ని రద్దు చేశారు. ఈ ఘటన స్థానికంగా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

పెళ్లి ఘనంగా జరిగింది. ఊరేగింపు అంతకంటే గ్రాండ్ గా నిర్వహించారు. ఊరంతా వచ్చారు బంధువులు, చుట్టాలు ఇలా ధూంధాంగా పెళ్లి జరిగింది. జస్ట్ పెళ్లి తంతు అంతా అలా ముగిసింది అందరూ భోజనాలు చేస్తున్నారు అంతా హ్యాపీ అనుకుంటున్న టైంలో పెళ్లి మండపంలో హడావిడి ఏంటా అని చూస్తే పెళ్లి కొడుకు మగాడు కాదు ట్రాన్స్ జండర్ అబ్బాయిగా మారిన అమ్మాయి అన్న విషయం తెలిసింది. పెళ్లి కూతురుకి మైండ్ బ్లాంక్ అయింది. యూపీలోని బారాబంకి జిల్లా కోఠిఠానా గ్రామంలో జరిగిందీ ఘటన. పెళ్లికి ముందు రోజు రాత్రి ఊరేగింపు గ్రాండ్ గా జరిగింది. తెల్లవారి కల్యాణమండపంలో కాసేపట్లో పెళ్లి జరగబోతోంది అనగా వధువు కుటుంబంలో గందరగోళం నెలకొంది. ఆచారం ప్రకారం కానుకలు సమర్పించే వేళ.. పెళ్ళికొడుకు మగాడు కాదు అబ్బాయిగా మారిన అమ్మాయి అని తేలడంతో అంతా అవాక్కయ్యారు. ఏం చేయాలో తెలీని స్థితిలోకి వెళ్లిపోయారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొనడంతో సీన్లోకి పోలీసులు ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. షాకైన బంధువులు, అతిధులు ఫంక్షన్ హాల్ నుంచి వెళ్లిపోయారు. నిజాన్ని దాచి తమ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని అనుకున్నారా అంటూ పెళ్ళికొడుకు పేరెంట్స్ ను నిలదీశారు వధువు తల్లిదండ్రులు. ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించారు బాధితులు. ఇరు వర్గాలతో మాట్లాడి పెళ్ళి ఆపేసి సమస్యను పరిష్కరించారు పోలీసులు. ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు పోలీసులు. ఆచారం ప్రకారం గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకునే సమయంలో వరుడు అబ్బాయి కాదని గుర్తించినట్లు తెలిపారు పోలీసులు. ఇరువర్గాలకు సర్ది చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటన అటు స్థానికంగా.. ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సాయం కావాలని ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి !! చివరికి

పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..

వారికి ఆ రైళ్లల్లో ఎమర్జెన్సీ కోటా.. బెర్త్ పొందడం ఎలా ??

ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు

Follow Us