ట్యాబ్‌లెట్ వేసుకుంటూనే కుప్పకూలిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన 24 ఏళ్ల సాయిచంద్ర గుండెపోటుతో అకాల మరణం చెందాడు. మూడు నెలల క్రితమే ఉద్యోగంలో చేరిన యువకుడు మెడికల్ షాపు వద్ద కుప్పకూలిపోయాడు. సీసీ కెమెరాలో రికార్డయిన ఈ విషాద ఘటన తల్లిదండ్రులను తీవ్ర శోకసంద్రంలో ముంచింది. కారేపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
చేతికొచ్చిన కొడుకు ప్రయోజకుడైతే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. కానీ, విధి ఆ ఆనందాన్ని మూడు నెలల ముచ్చటగానే మిగిల్చింది. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ, ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడని ఎన్నో ఆశలు పెటుకున్న తల్లిదండ్రుల ఆశ విధి ఆడిన వింతనాటకంలో తీరని విషాదంగా మిగిలిపోయింది. ఎదిగొచ్చిన ఒక్కగానొక్క కొడుకు విగతజీవిగా మారడంతో కన్నవారి రోదనలు మిన్నంటాయి. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రానికి చెందిన గణపతి నారాయణ, లక్ష్మీప్రసన్న దంపతుల ఏకైక కుమారుడు సాయి చంద్రకు 24 ఏళ్లు. బి.ఫార్మసీ పూర్తి చేసిన సాయిచంద్ర మూడు నెలల క్రితమే హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. సోమవారం రాత్రి ఎడమ చేయి లాగుతోందని అనిపించడంతో, హాస్టల్ పక్కనే ఉన్న ఒక మెడికల్ షాపుకు వెళ్లి టాబ్లెట్ అడిగాడు. ఆ మందు బిళ్ళ తీసుకునే లోపే ఒక్కసారిగా గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన షాపు సిబ్బంది సిపిఆర్ చేసి సపర్యలు చేశారు. అయిన ఫలితం దక్కలేదు. ఈ హృదయ విదారక దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. యువకుడి ఫోన్‌లో నెంబర్లు ఆధారంగా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారమిచ్చారు మెడికల్ షాపు సిబ్బంది. దాంతో యువకుడి బంధువులు హుటాహుటిన హైదరాబాద్‌కు వచ్చి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువెళ్లారు. సాయి చంద్ర తండ్రి నారాయణ గార్లవడ్డు లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు ప్రయోజకుడయ్యాడని మురిసిపోతున్న తరుణంలో, వచ్చిన మరణవార్త ఆ తల్లిదండ్రులను కుదిపేసింది. తెల్లవారుజామున మృతదేహాన్ని కారేపల్లికి తీసుకురావడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. చేతికి అందివచ్చిన కొడుకు విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Cow: తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్ అధికారులకు పట్టించిన ఆవు..
తాళి కట్టే సమయానికి రద్దయిన వివాహం.. అసలు వాడు మగాడే కాదా?
సాయం కావాలని ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి !! చివరికి
ఇదెక్కడి వాతావరణం.. ఇక్కడేమో ఎండలు.. అక్కడేమో వర్షాలు
రైల్వే ట్రాక్‌ను కమ్మేసిన పొగ..నిలిచిపోయిన రైలు
ఆ దేశంలో ఆఫీసులు .. స్వర్గానికి స్పాట్లు
వీళ్లు మనుషులేనా.. పెళ్లిలోనే పొట్టు పొట్టు కొట్టుకున్నారు కదా!
గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్.. ముప్పు తప్పదా?
ఏలియన్స్ నిజంగా ఉన్నారా? ఆ సీక్రెట్ ఫైల్స్‌లో ఏముంది?
ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు

