సినిమా చిన్నదే.. కానీ సక్సెస్ మాత్రం పెద్దది
వాలెంటైన్స్ డే కానుకగా విడుదలైన 'నిలవే' సినిమా అద్భుతమైన విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకుల అపూర్వ ఆదరణతో, ఇది బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామాగా నిలిచింది. కంటెంట్ ఉంటే సినిమాను ఆదరిస్తారని మరోసారి నిరూపించింది. 'గీతాంజలి'తో పోలికలు, చంద్రబోస్, వి. సముద్ర ప్రశంసలతో చిత్ర యూనిట్ సక్సెస్ సంబరాలను జరుపుకుంది. చిత్రబృందం తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.
కంటెంట్ ఉంటే చాలు.. చిన్నా పెద్దా అని తేడా లేకుండా.. సినిమాలను ఆదరిస్తుంటారు మన తెలుగు ప్రేక్షకులు. ఇప్పుడు కూడా అదే చేశారు. వాలైంటైన్స్ డే కానుకగా రిలీజ్ అయిన ‘నిలవే’ సినిమాను కూడా ఆదరించారు. ఈ మూవీ టీం పడిన కష్టాన్ని మెచ్చుకున్నారు. నాటి గీతాంజలి సినిమాతో పోలుస్తూ నెట్టింట ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ టీం సక్సెస్ సంబరాలను చేసుకుంది. తమకు మంచి విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు ఈ వేదికగానే స్పెషల్ థాంక్స్ చెప్పింది. సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ హీరోయిన్ గా నటించగా, హర్ష చెముడు, సుప్రియా ఐసోలా మరో జంటగా నటించారు. POV ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంది. బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామాగా అందరి ఆదరణ అందుకుంది. ఈ సందర్భంగా రామానాయుడు స్టూడియోలో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, గీత రచయిత చంద్రబోస్ వీడియో బైట్ ద్వారా స్పందిస్తూ బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్‌గా నిలిచిందని చెబుతూ టీమ్‌ను అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్ కు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకులు వి సముద్ర మాట్లాడుతూ.. “ఈ వాలెంటైన్స్ డేకి విడుదలైన ఆరేడు చిత్రాల్లో ‘నిలవే’ సక్సెస్‌ఫుల్ టాక్ తెచ్చుకుందన్నాడు. డీసెంట్ కలెక్షన్స్‌తో సైలెంట్ హిట్‌గా నిలిచిందని కొనియాడాడు. ఇందులోని హీరో హీరోయిన్ భవిష్యత్తులో కచ్చితంగా సూపర్ స్టార్స్ అవుతారన్నాడు. అంతేకాదు డైరెక్టర్ సాయి కే వెన్నంతో పాటు నిలవే.. టీమ్ అందరికీ వి సముద్ర తన శుభాభినందనలు తెలియజేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చడీచప్పుడూ కాకుండా.. OTTలోకి వచ్చిన టాప్ హర్రర్ ఫిల్మ్
Kamal Haasan: ఒకే రోజు రెండు ప్రమాదాలు.. కమల్ నిజంగా మృత్యుంజయుడే
ట్యాబ్‌లెట్ వేసుకుంటూనే కుప్పకూలిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
Cow: తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్ అధికారులకు పట్టించిన ఆవు..
ట్యాబ్‌లెట్ వేసుకుంటూనే కుప్పకూలిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్ అధికారులకు పట్టించిన ఆవు..
తాళి కట్టే సమయానికి రద్దయిన వివాహం.. అసలు వాడు మగాడే కాదా?
సాయం కావాలని ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి !! చివరికి
పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..
ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు
సిమ్ కార్డుల నుంచి బంగారం తీశాడు !! ఎలాగంటే

