AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamal Haasan: ఒకే రోజు రెండు ప్రమాదాలు.. కమల్ నిజంగా మృత్యుంజయుడే

Kamal Haasan: ఒకే రోజు రెండు ప్రమాదాలు.. కమల్ నిజంగా మృత్యుంజయుడే

Phani CH
|

Updated on: Feb 19, 2026 | 12:46 PM

Share

1986లో కమల్ హాసన్ ప్రాణాపాయం నుండి అద్భుతంగా బయటపడిన సంఘటన ఇది. ముంబై వెళ్తున్న విమానం సాంకేతిక లోపంతో ప్రమాదానికి గురవగా, కమల్ తోటి ప్రయాణికులను కాపాడటంలో కీలక పాత్ర పోషించారు. విమాన ప్రమాదం నుండి బయటపడిన కొద్దిసేపటికే, ఇంటికి వెళ్లే దారిలో టాక్సీలో మరో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సోషల్ మీడియా లేని ఆ రోజుల్లోనే ఈ జంట ప్రమాదాలు పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి.

చీమ చిటుక్కుమన్నా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జమానా ఇది. కానీ ఒకప్పుడు అలా కాదు! ఏం జరిగినా నెక్ట్స్ డే పేపర్ వచ్చేవరకో లేదంటే.. స్వయంగా చెప్పేవరకో ఎవరికీ ఏ విషయం తెలిసేది కాదు. కమల్ కు సంబంధించిన ఓ అరుదైన సంఘటన కూడా అలాంటిదే.. ! సోషల్ మీడియా లేని ఆ రోజుల్లోనే దావానలంలా వ్యాపించిన ఒక సంఘటన అది. తృటిలో ప్రాణాపాయం నుంచి బటయపడ్డ కమల్‌ బ్యాకెండ్ స్టోరీ ఇది. అది 1986, సెప్టెంబర్ 29. షూటింగ్ కోసం చెన్నై నుండి ముంబై బయలుదేరిన లోకనాయకుడు కమల్ హాసన్.. రెండు గంటల్లోనే తిరిగి ఆల్వార్‌పేటలోని తన ఆఫీసుకి ఫోన్ చేశారు. మేనేజర్ ఆశ్చర్యంగా ‘సార్, అప్పుడే ముంబై చేరిపోయారా?’ అని అడగగా.. ‘నేను చేరాల్సింది ముంబైకి కాదు, పైలోకానికి.. కానీ తృటిలో ప్రమాదం తప్పింది’ అంటూ కమల్ షాకింగ్ సమాధానం ఇచ్చారు. కారు పంపిస్తానన్న ఆఫర్‌ని కూడా సున్నితంగా తిరస్కరించి.. ఎయిర్‌పోర్ట్ నుండి నేరుగా ఒక సాధారణ టాక్సీలోనే ఇంటికి బయలుదేరారు. కమల్ తన మేనేజర్‌కు ఫోన్ చేయడానికి సరిగ్గా గంట ముందు ఏం జరిగిందంటే.. గాల్లో ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. మద్రాసు మీనంబాకం విమానాశ్రయం నుండి 185 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బందితో గాల్లోకి లేచిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం సాంకేతిక లోపంతో ప్రమాదానికి గురైంది. ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులందరూ భయంతో వణికిపోయారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా పైలట్ అద్భుతమైన సమయస్ఫూర్తిని ప్రదర్శించి, విమానాన్ని అత్యవసరంగా క్రాష్ ల్యాండ్ చేశారు. ఆ విమానంలో కమల్‌తో పాటు అప్పటి ప్రముఖ నటీమణులు శ్రీప్రియ, అంజలి నాయుడు కూడా ఉన్నారు. దట్టమైన పొగ, మంటల మధ్య ఊపిరి ఆడటం కష్టంగా ఉన్నా, కమల్ హాసన్ తన ప్రాణాల గురించి మాత్రమే ఆలోచించలేదు. తోటి ప్రయాణికులకు మనోధైర్యాన్ని నూరిపోస్తూ.. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా వాళ్ళను సురక్షితంగా బయటికి పంపడంలో కీలక పాత్ర పోషించారు. రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లో కూడా ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి నిజమైన హీరో అనిపించుకున్నారు కమల్. కానీ విధి అక్కడితో ఆగలేదు. మరో విచిత్రమైన నాటకం ఆడింది. విమానాశ్రయం నుండి ఇంటికి టాక్సీలో వెళ్తున్నప్పుడు, డ్రైవర్ ఆతృతగా ప్రమాదం వివరాలు అడిగాడు.కమల్ వివరిస్తున్న క్రమంలోనే కమల్ మాటల్లో లీనమైపోయిన డ్రైవర్.. పరధ్యానంలో టాక్సీని నేరుగా వెళ్లి ఒక స్తంభానికి ఢీకొట్టాడు. విమాన ప్రమాదం నుండి బయటపడిన కమల్.. ఇలా ఇంటికి వెళ్లే దారిలో రోడ్డు ప్రమాదానికి గురవ్వడం నిజంగా విచిత్రమే అయినప్పటికీ.. ఈ జంట ప్రమాదాల ముచ్చట తరచూ ఇండస్ట్రీలో ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. వైరల్ అవుతూనే ఉంటుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్యాబ్‌లెట్‌ వేసుకుంటూనే కుప్పకూలిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

Cow: తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్‌ అధికారులకు పట్టించిన ఆవు..

తాళి కట్టే సమయానికి రద్దయిన వివాహం.. అసలు వాడు మగాడే కాదా?

సాయం కావాలని ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి !! చివరికి

పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..

Follow Us