AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చడీచప్పుడూ కాకుండా.. OTTలోకి వచ్చిన టాప్ హర్రర్ ఫిల్మ్

చడీచప్పుడూ కాకుండా.. OTTలోకి వచ్చిన టాప్ హర్రర్ ఫిల్మ్

Phani CH
|

Updated on: Feb 19, 2026 | 12:53 PM

Share

ఈ వారం ఓటీటీలో సందడి చేస్తున్న భయానక సినిమా 'ఈషా' అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. గతేడాది థియేటర్లలో హిట్‌గా నిలిచిన ఈ హారర్ థ్రిల్లర్, IMDBలో 9.3 రేటింగ్ సాధించింది. దెయ్యాలు లేవని నమ్మే స్నేహితుల బృందం, ఓ సవాలును స్వీకరించి పాడుబడ్డ బంగ్లాలో ఏం ఎదుర్కొన్నారు? ఈ ఉత్కంఠభరిత కథాంశం హారర్ ప్రియులను ఆకట్టుకుంటోంది. తప్పక చూడాల్సిన ఓటీటీ సినిమా.

ఎప్పటిలాగే ఈ వారం కూడా.. ఓటీటీల్లో.. కొత్త సినిమాల, వెబ్ సిరీస్ ల సందడి మొదలైపోయింది. అయితే ఈ సందడిలో.. ఓ సినిమా అందర్నీ భయపెట్టేస్తోంది. హర్రర్ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఆ సినిమానే ఈషా. గతేడాది విడుదలైన ఈషా మూవీ.. థియేటర్లలో అందర్నీ ఆకట్టుకుంది. హిట్టు బొమ్మగా ట్యాగ్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే చడీచప్పుడు కాకుండా.. ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ ప్రస్తుతం స్ట్రీమ్ అవుతోంది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఒళ్లు గగుర్పొడిచే సీన్లు, ఊహించని ట్విస్టులతో ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించింది ఈషా మూవీ.. అలాగే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. IMDBలోనూ 9.3 రేటింగ్ సాధించింది.ఇప్పుడు ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.హర్రర్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈషా మూవీ కథ విషయానికి వస్తే.. కల్యాణ్, నయన, అపర్ణ, వినయ్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. దెయ్యాలు, ఆత్మలు లేవని బలంగా నమ్ముతుంటారు. ఓ బృందంగా ఏర్పడి దొంగ బాబాలు, స్వామిజీల ఆగడాలు, బండారాల్ని బయటపెడుతుంటారు. అలా ఓసారి ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉంటున్న ఆదిదేవ్ బాబా గురించి తెలుసుకుంటారు. అతని నిజ స్వరూపం బయట పెట్టాలని అతని దగ్గరకు వెళతారు.అయితే ఆత్మలు, దెయ్యాల విషయంలో ఈ నలుగురికి బాబా ఓ ఛాలెంజ్ చేస్తాడు. ఆ సవాలును స్వీకరించిన హీరో బృందం ఒక భయంకరమైన పాడుబడిన బంగ్లాలో మూడు రోజుల పాటు నివసించడానికి వెళ్తారు. మరి ఆ పాడుబడ్డ బంగ్లాలో వారికి ఎదురైన భయానక పరిస్థితులు ఏమిటి? పుణ్యవతి అనే ఆత్మకు, గిరిజనుడైన మైమ్ మధుకు ఉన్న సంబంధం ఏమిటి? చివరకు ఆ మిత్రులు ఆత్మలు, దెయ్యాలు ఉన్నాయని నమ్మారా? లేదా? అన్నప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ హారర్ థ్రిల్లర్ సినిమా చూడాల్సిందే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kamal Haasan: ఒకే రోజు రెండు ప్రమాదాలు.. కమల్ నిజంగా మృత్యుంజయుడే

ట్యాబ్‌లెట్‌ వేసుకుంటూనే కుప్పకూలిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

Cow: తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్‌ అధికారులకు పట్టించిన ఆవు..

తాళి కట్టే సమయానికి రద్దయిన వివాహం.. అసలు వాడు మగాడే కాదా?

సాయం కావాలని ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి !! చివరికి

Follow Us