ఎండాకాలం ప్రారంభంలోనే గృహోపకరణాల పేలుళ్లు ఆందోళన కలిగిస్తున్నాయి. మొగల్తూరు కొండవారిపాలెంలో ఒక ఇంటిలో ఫ్రిడ్జ్ భారీ శబ్దంతో పేలిపోయింది. వెంటనే మంటలు చెలరేగి, ఇంట్లో దట్టంగా పొగ కమ్ముకుంది. ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు భయంతో బయటకు పరుగులు తీశారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను విజయవంతంగా అదుపులోకి తీసుకువచ్చారు.