- Telugu News Photo Gallery Cricket photos India Player Hardik Pandya shares romantic photo on Mahieka Sharma birthday during T20 World Cup 2026
Hardik Pandya: ప్రియురాలితో స్విమ్మింగ్ పూల్‌లో హార్దిక్.. ఆ ఫొటోతో స్పెషల్‌గా విష్ చేసిన ఆల్ రౌండర్
Hardik Pandya - Mahieka Sharma: టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా స్నేహితురాలు మహికా శర్మ ఈరోజు తన 25వ పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ ప్రత్యేక సందర్భంగా పాండ్యా షేర్ చేసి ఓ ఫొటో వైరల్ గా మారింది. ఇదే ఫొటోతో మహికాకు శుభాకాంక్షలు తెలిపాడు.
Updated on: Feb 19, 2026 | 12:50 PM

Mahieka Sharma birthday: 2026 టీ20 ప్రపంచ కప్ మధ్య, హార్దిక్ పాండ్యా తన స్నేహితురాలు మహికా శర్మకు పుట్టినరోజున స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. పాండ్యా అర్ధరాత్రి సోషల్ మీడియాలో ఆమెకు రొమాంటిక్ పుట్టినరోజు పార్టీతో శుభాకాంక్షలు తెలిపాడు. ప్రత్యేక సందర్భం కోసం అతను ఒక ఫొటోను పంచుకున్నాడు. ఇది వేగంగా వైరల్ అవుతోంది.

హార్దిక్ పాండ్యా తన స్నేహితురాలు మహిక శర్మ పుట్టినరోజు సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక స్టోరీని పంచుకున్నాడే. పొటోలో, ఈ జోడీ స్విమ్మింగ్ పూల్‌లో కనిపించారు. హార్దిక్ మహికాను కౌగిలించుకుంటున్నాడు. ఈ రొమాంటిక్ ఫొటోను షేర్ చేస్తూ, హార్దిక్ పాండ్యా "హ్యాపీ బర్త్‌డే, నా యువరాణి" అని రాసుకొచ్చాడు.

హార్దిక్ కు స్టేడియంలో మద్దతుగా 2026 టీ20 ప్రపంచ కప్ లో జరిగే ప్రతి మ్యాచ్ కు మహికా శర్మ హాజరవుతోంది. ఆమె జట్టుతో కూడా ప్రయాణిస్తున్నట్లు కనిపించింది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం మహికా హార్దిక్ తో పాటు శ్రీలంకకు కూడా వెళ్ళింది.

మహికా శర్మ మోడల్, నటి, ఫిట్‌నెస్ కంటెంట్ క్రియేటర్. ఢిల్లీలో జన్మించిన మహికా ఎకనామిక్స్, ఫైనాన్స్‌లో డిగ్రీ పట్టభద్రురాలైంది. ఆమె నేడు తన 25వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటుంది. హార్దిక్, మహికా రిలేషన్ షిప్ గత సంవత్సరం నుంచి వార్తల్లో ఉంది. హార్దిక్ తన మాజీ భార్య నటాషా స్టాంకోవిక్‌ను 2014లో విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి మహికాతో డేటింగ్ చేస్తున్నాడు.

హార్దిక్ పాండ్యా గురించి చెప్పాలంటే, 2026 టీ20 ప్రపంచ కప్‌లో అతను టీమ్ ఇండియాకు ప్రధాన మ్యాచ్ విన్నర్‌గా నిరూపించుకుంటున్నాడు. అతను నాలుగు మ్యాచ్‌ల్లో 87 పరుగులు చేశాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. అతను ఐదు వికెట్లు కూడా పడగొట్టాడు. నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు.
