AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.450 భారీ బడ్జెట్.. కట్ చేస్తే డిజాస్టర్ సినిమా..! కానీ హీరో క్రేజ్‌తోనే రూ. 100కోట్లకు పైగా కలెక్షన్స్

కొన్ని సినిమాలు విడుదలై సంచలన విజయాలను సాధిస్తూ.. ఇండస్ట్రీలోని రికార్డ్స్ క్రియేట్ చేయడం బ్రేక్ చేయడం వంటివి చేస్తున్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ అవుతుంటాయి. తెలుగులో కూడా చాలా సినిమాలు భారీ అంచనాలు మధ్య విడుదలై డిజాస్టర్ అయ్యాయి.

రూ.450 భారీ బడ్జెట్.. కట్ చేస్తే డిజాస్టర్ సినిమా..! కానీ హీరో క్రేజ్‌తోనే రూ. 100కోట్లకు పైగా కలెక్షన్స్
Movie
Rajeev Rayala
|

Updated on: Feb 19, 2026 | 3:56 PM

Share

ఇప్పుడు తెలుగు సినిమాల స్థాయి వేరు.. ప్రపంచం మొత్తం తెలుగు సినిమాల వైపు చూస్తుంది. మన దగ్గర తెరకెక్కుతున్న సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా విజయాలు సాధిస్తూ సంచలనాలు సృష్టిస్తున్నాయి. దాంతో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా అన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు భారీ బడ్జెట్ తో.. భారీ అంచనాల మధ్య విడుదలవుతూ ఉంటాయి. కొన్ని సినిమాలు అనుకున్న విధంగా భారీ విజయాలను అందుకుంటుంటే.. మరికొన్ని సినిమాలు మాత్రం దారుణంగా నిరాశపరిస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా కూడా భారీ అంచనాల మధ్య విడుదలైంది. అంతే కాదు ఓ స్టార్ హీరోగా నటించగా.. టాప్ దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను దాదాపు రూ. 450కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.

ఇదేంది మావ..! రాధికా శరత్ కుమార్ చెల్లెలు కూడా హీరోయినా..!! బాలయ్యతో బ్లాక్ బస్టర్స్

ఆ సినిమా ఎదో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా హిట్ తర్వాత చరణ్ నటించిన సినిమా కావడంతో గేమ్ ఛేంజర్ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. చరణ్ హీరోగా నటిస్తుండటంతో పాటు స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం కావడంతో ఈ సినిమా పై అంచనాలు తారాస్థాయిలోకి చేరాయి. ఈ సినిమా విడుదల సమయంలో అభిమానులు కూడా ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని. ఇండస్ట్రీకి రికార్డ్ క్రియేట్ చేస్తుదని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

ఎలా రా ఇలా.! వైరల్ వీడియో పై సంయుక్త రియాక్షన్.. ఇంతకూ ఆ ఫొటోలో ఉంది ఎవరు.?

అంతే కాదు ఈ సినిమాలో శ్రీకాంత్, అంజలి, కియార్ అద్వానీ, ఎస్‌జే సూర్య, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. అలాగే ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ లో నటించారు. అంతే కాదు టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించారు. కాగా సినిమా విడుదలైన తర్వాత చరణ్ అభిమానులు దారుణంగా నిరాశపడ్డారు. అభిమానులు ఒకటి ఊహిస్తే సినిమా మరోలా ఉండటంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. కాగా ఈ సినిమా ఇండియా వైడ్ గా రూ. 130కోట్లు వసూల్ చేసింది. చరణ్ కేజ్ మీద ఈ సినిమా రూ. 100కోట్లకు పైగా వసూల్ చేసింది.

ఇవి కూడా చదవండి

ప్రేమించి పెళ్లాడింది.. కట్ చేస్తే మూడేళ్లకే విడాకులు.. ఇప్పుడు మరొకరితో

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us